అక్కడ మాస్క్ ధరిస్తే భారీగా జరిమానా.. కారణం?

0
61

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని,మాస్కు ధరించినప్పుడే ఈ కరోనా బారిన పడకుండా ఉండగలమని అధికారులు ఆదేశాలను జారీ చేశారు.ఈ క్రమంలోనే మాస్కులు లేకుండా బయట కనిపిస్తే పోలీసులు పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తారు. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక రెస్టారెంట్లో మాత్రం మాస్క్ ధరిస్తే మాత్రం అధిక జరిమానా విధిస్తారు. ఈ విధంగా జరిమానా విధించడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫిడిల్‌హెడ్స్ కేఫ్‌లో ఈ వింత నిబంధన అమలులో ఉంది.ఆ రెస్టారెంట్ కి ఎవరైనా మాస్కు ధరించి వెళితే తప్పనిసరిగా వారు కట్టే టటువంటి బిల్లుపై అదనంగా ఐదు డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.కేవలం మాస్క్ పెట్టుకొని మాత్రమే కాకుండా వారు వ్యాక్సిన్ తీసుకున్నామని ప్రచారం చేసినా కూడా ఐదు డాలర్ల అధికంగా జరిమానా కట్టాల్సి ఉంటుంది.

ఈ రెస్టారెంట్ లో ఉన్న నిబంధనలను ముందుగానే కస్టమర్లకు తెలియడానికి రెస్టారెంట్ గోడలపై పోస్టర్లు కూడా అతికించారు.ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు మాస్కు పెట్టుకుంటే జరిమానా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రెస్టారెంట్ ఈ విధంగా జరిమానా విధించడానికి గల కారణం ఏమిటంటే.. ఈ విధంగా కస్టమర్లు చెల్లించిన జరిమానా మొత్తం తమ స్వలాభం కోసం కాకుండా స్వచ్ఛంద సమస్త చారిటీ కోసమేనని రెస్టారెంట్ ఈ విధంగా జరిమానా విధించారని తెలుస్తుంది.

ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర సమయంలో స్వచ్ఛంద సంస్థల కోసం రెస్టారెంట్ ఈ విధంగా జరిమానా విధించడంతో కస్టమర్లు సైతం మాస్కు పెట్టుకొని ఐదు డాలర్ల జరిమానా చెల్లించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ ఒక స్వచ్ఛంద సంస్థ కోసం ఈ విధమైన పనిచేయటం నేను తప్పుగా భావించడం లేదని తెలపడంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here