భారతదేశానికి ఒక తెలుగు నాయకుడు ప్రధానిగా పని చేసిన మొదటి వ్యక్తి పీవీ నరసింహరావు. ఆ పదవిలో ఉన్న ఒకే ఒక్క తెలుగువాడు కావడం అందరికీ గర్వకారణం. అలాంటి ఈ లెజెండరీ లీడర్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది .

ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ ప్రకటన చేశారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు రావు బతికి ఉన్న సమయంలో.. ఆయన ప్రధానిగా దేశానికి చేసిన సేవలు తతితర విషయాలను ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలు భారతదేశ రూపురేఖలను మార్చాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి అంశాలను ప్రవేశపెట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. అతడి జీవితంలో ఎన్నో మరపురాని విజయాలు ఉన్నాయి. ఆహా స్టూడియోస్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించిన అల్లు అరవింద్.. పీవీ బయోపిక్ పై అధికారిక ప్రకటన చేశారు.
గతంలో వినయ్ సీతాపతి‘హాఫ్ లయన్’ పేరుతో పీవీ జీవిత కథను పుస్తకం రూపంతో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ పుస్తకం ఆధారంగా పీవీ బయోపిక్ ని వెబ్ సిరీస్ రూపంలో తీసుకు రాబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ ఝా దర్శకత్వం వహించనున్నారు . ఈ సిరీస్ తెలుగు , హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులోకి రానుంది. దీనిలో నటించే వారి వివరాలు.. సాంకేతిక వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.































