కరోనా వేళా.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

0
133

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా పరిస్థితులలో ఏ వస్తువు తాకాలన్న ఎంతో భయం వేస్తుంది. అదే విధంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్న ఎక్కడ వైరస్ బారిన పడతామో అనే అనుమానాలు కలుగుతుంటాయి. వైరస్ భయం పెట్టుకుని ఏ వస్తువుని తినకుండా ఉండలేము.. అలాగే ఏ పదార్థాలను తాగకుండా ఉండలేము. కనుక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారినపడకుండా ఉంటామో జాతీయ పోషకాహార సంస్థ సూచిస్తోంది.

మనం కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మన ఇంట్లో ఉపయోగించే సంచిని మన వెంట తీసుకువెళ్లాలి. మార్కెట్లో మనకు అవసరమైన కూరగాయలను మాత్రమే తాకి జాగ్రత్తగా సంచిలో వేయించుకోవాలి.మార్కెట్లో రెండు మూడు రోజుల క్రితం వాడిపోయిన కూరగాయలు కాకుండా తాజాగా ఉన్న కూరగాయలు మాత్రమే తెచ్చుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూరగాయలను కొళాయి కింద శుభ్రం చేయాలి. ఈ విధంగా పారుతున్న నీటి కింద శుభ్రం చేయటం వల్ల ఎలాంటి వైరస్ అయిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంది.

ఈ విధంగా కూరగాయలను, మాంసాన్ని శుభ్రంగా కడిగి వాటిని ఫ్రిజ్లో భద్రపరచుకోవాలి. మరికొందరు బయట నుంచి ఆహారపదార్థాలను తెప్పించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆహార పదార్థాలు వచ్చినప్పుడు ఆహారపదార్థాలకు తగలకుండా బయట కవర్ పై శానిటైజ్ చేసి ఆ కవర్లను చెత్తకుండీలో పడేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం ఆహారపదార్థాలను చేతితో తాకకుండా గరిటే ద్వారా వడ్డించుకోవాలి.

మనం కూరగాయలను కట్ చేసే కత్తి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క వస్తువును ఎంతో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువులను శుభ్రం చేసిన తర్వాత తప్పకుండా మన చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి. ఫ్రిజ్లో భద్రపరిచి కూరలు ఇతర పదార్థాలకు తప్పకుండ మూతపెట్టి భద్రపరుచుకోవాలి. ముఖ్యంగా మన చేతి గోళ్ళను పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలని, ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించినప్పుడు మనం ఎంతో సురక్షితంగా ఉండవచ్చని జాతీయ పోషకాహార సంస్థ పలు సూచనలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here