మనం నిత్యం వినియోగించి అప్లికేషన్ లలో ఒకటైన వాట్సాప్ వాట్సాప్ పేమెంట్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే యాప్ ల ద్వారా ఏ విధంగా నగదును బదిలీ చేస్తున్నామో అదే విధంగా వాట్సాప్ ద్వారా మన స్నేహితులకు, బంధువులకు నగదును బదిలీ చేయవచ్చు. చాలారోజుల నుంచి వాట్సాప్ పేమెంట్ సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నా ఎన్పీసీఐ అనుమతుల వల్ల ఈ సర్వీసులు అందుబాటులోకి రాలేదు.

వాట్సాప్ పేమెంట్ సర్వీసులను ప్రారంభించడంతో ఇప్పటికే పాపులర్ అయిన యూపీఐ యాప్స్ కు భారీ షాక్ తగలనుందని చెప్పవచ్చు. వాట్సాప్ పేమెంట్ సర్వీసులను వినియోగించాలంటే స్మార్ట్‌ఫోన్ లో రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ పేమెంట్ సర్వీసుల కోసం యాప్ ఓపెన్ చేసిన తరువాత మూడు డాట్స్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అందులో కనిపించే పేమెంట్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం బ్యాంక్ తో లింక్ అయిన నంబర్ ను ఎంచుకుని బ్యాంక్ ఖాతాలను సెలెక్ట్ చేసుకుని యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం డెబిట్ కార్డ్ యొక్క వివరాలను పొందుపరిచి ఓటీపీని ఎంటర్ చేసి యూపీఐ పిన్ ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత సులభంగా ఇతరులకు వన్ టైమ్ పాస్ వర్డ్ సహాయంతో రిజిష్టర్ చేసుకోవచ్చు.
పేమెంట్స్ ఆప్షన్ లోకి వెళ్లి కాంటాక్ట్స్ లోని నంబర్లను ఎంపిక చేసుకుని సులభంగా ఇతరులకు నగదును బదిలీ చేయవచ్చు. అయితే అవతలి వ్యక్తులకు కూడా వాట్సాప్ పేమెంట్ సర్వీసులు యాక్టివ్ గా ఉంటే మాత్రమే నగదు బదిలీ చేయడం సాధ్యమవుతుంది.
































