Shruti Hassan: సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి మొదట్లో ఐరన్ లెగ్ అంటూ ఎన్నో విమర్శలు అందుకొని అనంతరం గోల్డెన్ లెగ్ గాఎంతో పేరు సంపాదించుకున్న నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాప్ చిత్రాలను ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ దూసుకెళుతోంది.

ఇదిలా ఉండగా ప్రతి సినిమాలో విభిన్నమైన పాత్ర ద్వారా హీరోయిన్లు ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు నెటిజన్ల ట్రోలింగ్ కు గురి కావాల్సి ఉంటుంది. ఇలా శృతిహాసన్ కూడా నాగ చైతన్య తో నటించిన ఓ సినిమా సమయంలో దారుణంగా ట్రోలింగ్ కు గురైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా కెరీర్లో ఈ సినిమా చేయకూడదని బాధపడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా అనే ప్రశ్న ఎదురుగా ఆ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 2016 లో నాగచైతన్యతో కలిసి నటించిన ‘ప్రేమమ్’ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.
ఆ హీరోయిన్ తో పోల్చి నన్ను ట్రోల్ చేశారు….

ప్రేమమ్ సినిమాలో నేను చేసిన మలర్ పాత్రను మలయాళ ఒరిజినల్ వెర్షన్ సాయిపల్లవితో పోల్చి నన్ను బాగా ట్రోల్ చేశారు. ఈ సినిమా సమయంలో నా గురించి వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో నరకం అనుభవించాను. అసలు ఈ సినిమాలో నటించకపోయి ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు బాధ పడ్డానని శృతిహాసన్ తెలియజేశారు. ఇక ఆ విషయాల గురించి పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశానని తెలియజేశారు.































