శ్రావణమాసంలో పాలను తాగకూడదు.. ఒకవేళ తాగితే ఏమవుతుంది..?

0
167

శ్రావణమాసం రాగానే చాలామంది పాలను తాగరు. వాటిని దూరంగా ఉంచుతారు. దానికి గల కారణం ఏంటనేది చాలామందికి తెలవదు. లక్ష్మీదేవికీ, శివుడికీ ప్రీతిపాత్రమైన శ్రావణమాసం రాగానే ఎందుకు తాగరు అనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంటుంది. దానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు పురాణాల్లో పాల సముద్రం నుంచి విషం బయటకు వచ్చింది.

ఆ విషాన్ని శివుడు తన కంఠంలో దాచుకున్నట్లు పురాణాల ప్రకారం తెలుస్తోంది. అందువల్లే శ్రావణమాసంలో పాలకు దూరంగా ఉంటుంటారు. పూజకు తీసుకెళ్లిన పాలను స్వామికే అభిషేకం చేస్తే పరమేశ్వరుడి కృప పొందాలని భక్తులు అలా చేస్తారనే ప్రతీతి ఉంది. దీని వెనుక సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో పురుగులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి.

గేదెలు, ఆవులు తినే గడ్డిలో కూడా ఆ పురుగులు దాగి ఉంటాయి. పశువులు వాటిని తినేస్తాయి. దీంతో పాలలో హానికరమైన పదర్ధాలు ఉంటాయని.. అందువల్ల శ్రావణమాసంలో పాలను తాగరని చెబుతుంటారు. వ్యాధుల బారిన పడకుండా ఇలా పాలకు దూరంగా ఉంటడం మంచిదని పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా వానాకాలంలో మనిషి వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.

ఉపవాస దీక్షలు చేయడంతో పొట్ట ఖాళీగా ఏర్పడుతుంది. అందులో పాలను తాగడం వల్ల అవి సరిగ్గా అరగవు. దీంతో గ్యాస్, డయేరియా, ఎసిడిటీ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. అందువల్ల పాలు తాగకపోయిన నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తే మంచిది.