నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహా యాప్ ద్వారా ప్రసారమౌతున్న “అన్ స్టాపబుల్” అనే టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు వచ్చారు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ టాక్ షో కి సంబంధించిన ప్రీమియర్స్ ప్రసారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ మోహన్ బాబును ఎన్నో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. అయితే మోహన్ బాబు కూడా బాలకృష్ణను ఒక ప్రశ్న అడిగారు. అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆయన వారసుడిగా అతని మరణం తర్వాత పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్న విన్న బాలకృష్ణ తనదైన శైలిలో మోహన్ బాబుకు దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సమాధానం చెబుతూ..మా తెలుగుదేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకు అతీతంగా అలాంటిది పెద్దాయన మరణం తర్వాత పార్టీ పగ్గాలు మేము తీసుకుంటే దానికి అర్థం ఉండదని ఈ సందర్భంగా బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఇక చంద్రబాబుకి పార్టీ పగ్గాలు ఎందుకు ఇచ్చారనే విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో కష్ట పడే వ్యక్తిత్వం కలవారు. గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుంచి అన్ని చూసి వచ్చిన మనిషి చంద్రబాబు అంటూ బాలకృష్ణ మోహన్ బాబు ప్రశ్నకు ఇలా సమాధానం తెలియజేశారు.






























