కాంట్రవర్సీ కా బాప్ రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఎవరి మీదు ఎప్పుడు ట్వీట్ చేస్తారో అర్థం కాదు. అయితే మొదట్లో అతడి దర్శకత్వం వహించిన సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అతడి డైరెక్షన్ లో కూడా ఆ మార్క్ ని చూపించేవారు. కొంతమంది హీరోల కెరీర్ ను కూడా నెలబెట్టిన ఘనత ఆర్జీవీది.

అంతటి పాపులారిటీని సంపాదించికున్న రామ్ గోపాల్ వర్మ.. తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎందుకు ఇలా అతడు దూరంగా ఉండాల్సి వచ్చింది.. దానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల వర్మ ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు.. తాను జీవితంలో కేవలం ఒక్కసారే భయపడ్డానని, అది కూడా కేవలం 20 సెకండ్లు మాత్రమే అని చెప్పుకొచ్చాడు.
ఓ రోజు ముంబై వెళ్తున్న సమయంలో జర్నీలో ఉండగా.. నలుగురు వ్యక్తులు తననే చూస్తున్నారనే ఫీలింగ్ లో ఉన్నాడట వర్మ. వర్మ దిగి అక్కడి నుంచి వెళ్లగా.. వారు ఆయన్ని అలాగే చూస్తున్నారట. ఆ విషయాన్ని తన డ్రైవర్ కి చెప్పగా.. డ్రైవర్ వాళ్లు లిఫ్ట్ రిపేర్ చేయడానికి వచ్చిన వారని తెలిపారు. కానీ రాంగోపాల్ వర్మ డైరెక్టర్ అని గుర్తుపట్టడం చేత, వాళ్లు అలా చూశారని ఆ తర్వాత డ్రైవర్ చెప్పినట్లు రాంగోపాల్ వర్మ నవ్వుతూ తెలిపారు.
ఇక తన ఫ్యామిలీ గురించి చెబుతూ.. ఎందుకు తన ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు అంటే.. పెళ్లి అయితే అర్థాంతరంగా జీవితం అయిపోతుందనే భావనలో వర్మ ఉన్నట్లు తెలిపాడు. అంతేకాకుడా పెళ్లి అయిన తర్వాత భార్య, పిల్లలు, చదువు, ఉద్యోగం ఇదే జీవితం అయిపోతుంది. ఇలా మన జీవితానికి ఒకటి అంటూ ఏమీ ఉండదు. అందుకే తన భార్యతో దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు ఆర్జీవీ.





























