శీతాకాలం మొదలైంది. దీనితో పాటుగా శీతాకాలంలో పలురకాల వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో వచ్చే వ్యాధుల నుంచి బయటపడేందుకు ఉపయోగపడే పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. అలాంటి వాటిలో ముఖ్యంగా ఉసిరికాయ కూడా ఒకటి. ఉసిరికాయలో విటమిన్ సి,అలాగే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయన్న విషయం మనకు తెలిసిందే. శీతాకాలంలో వచ్చే ఎన్నో రకాల సమస్యలను ఉసిరి అరికడుతుంది. మరి ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది : చలికాలంలో ఉసిరికాయను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ఉసిరికాయతో చేసిన చ్యవన్ ప్రాష్ తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు, ఇన్ఫెక్షన్లను,జలుబు, దగ్గు వంటి శీతాకాల వైరస్ లను దూరం చేస్తుంది.
మలబద్ధకం నుంచి ఉపశమనం : శీతాకాలంలో మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలి అంటే ఉసిరికాయలు తీసుకోవాల్సిందే. ఉసిరికాయ మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియ వ్యవస్థను బలంగా మారుస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: ఉసిరికాయను శీతాకాలంలో తీసుకోవడం వల్ల జుట్టు రాలడం ఇలాంటి సమస్యను అరికడుతుంది. ఉసిరికాయలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.
చలికాలంలో ఉసిరికాయ పొడిని వేడి నీటిలో, తేనెలో కలిపి తాగాలి. దీనిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఉసిరి రసాన్ని ఒక గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఉసిరికాయ పచ్చడి లేదా మురబ్బాను కూడా తినవచ్చు. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి.


































