ఇతర దేశాలతో పోల్చి చూస్తే స్త్రీలను గౌరవించే దేశాలలో భారత్ ముందువరసలో ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం మహిళలను ఇక్కడ శక్తిస్వరూపాలుగా పూజిస్తారు. అయితే దేశంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితులు మాత్రం ఉండవు. దేశంలోని పలు ప్రాంతాలలో మహిళలపై అత్యాచార ఘటనలు, హత్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్నా ఈ ఘటనలకు చెక్ పెట్టలేకపోతున్నాయి.

అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలోని ఒక కుగ్రామంలో మాత్రం భార్యలను అద్దెకు ఇచ్చే సంస్కృతి ఉంది. డబ్బు కోసం సొంత భర్తలు తమ భార్యలను పరాయి పురుషులకు అద్దెకు ఇస్తారు. చాలా సంవత్సరాల నుంచి గ్వాలియర్ జిల్లాలోని శివపురి గ్రామంలో ఈ దురాచారం కొనసాగుతోంది. మహిళలను అంగడి సరుకుల్లా విక్రయించే ఈ సంస్కృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఇక్కడి ప్రజల ఆలోచనా తీరులో మాత్రం మార్పు రాలేదు.

శివపురి ప్రాంతంలోని గ్వాలియర్ రాజపుత్రులు ఎక్కువగా జీవనం సాగిస్తారు. ఈ రాజపుత్రులలో ఎక్కువమంది డబ్బున్న వారు కావడం గమనార్హం. అయితే ఈ రాజపుత్రుల కొరకు ఈ గ్రామంలో పేద మహిళల్లో నచ్చిన వారిని అద్దెకు తీసుకెళ్లే సౌకర్యం ఉంది. ఆ అద్దె 10 రూపాయల నుంచి లక్షల రూపాయాల వరకు ఉంటుంది. ‘అడీచప్రద’ పేరుతో ఈ దురాచారం ఆ గ్రామంలో నేటికీ కొనసగుతూ ఉండటం గమనార్హం.

16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అందమైన మహిళలను భర్తలు ఈ విధంగా అద్దెకు ఇస్తూ ఉంటారు. ఇరు పార్టీలు సంతకాలు చేసుకుని ఒప్పందం కుదుర్చుకుని అద్దెకు ఇచ్చే సంప్రదాయం గ్రామంలో కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here