అమ్మా నన్ను ఇంటికి తీసుకెళ్లండంటూ కూతురు ఫోన్.. వద్దన్న తల్లి.. అదే రోజు రాత్రి..

0
230

దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడం అనేది సాధారణం. కానీ అవి సాగదీసుకుంటూ.. ఉండకుండా సమస్యను పరిష్కరించుకోవడం అనేది మంచిది. లేదంటే ఈ గొడవలు చాలా దూరం వెళ్లి అనర్థాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల గ్రామపంచాయతీ పరిధిలోని మొలాలగుట్టకు చెందిన నాగోరావ్ తో గాదిగూడ మండలం పర్సువాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోతిబాయికి గత సంవత్సరం క్రితం వివాహం జరిగింది. రాఖీ పండుగ సందర్భంగా ఆమె పుట్టింటికి వెళ్లి.. తమ్ముడికి రాఖీ కట్టి మళ్లీ తిరిగి తన అత్త ఇంటికి వచ్చేసింది.

మరల ఇటీవల తన తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. తాను పుట్టింటికి వస్తాను.. నన్ను తీసుకెళ్తేందుకు తమ్ముడిని పంపు ’అంటూ ఆమె మాట్లాడింది. దానికి ఆమె తల్లి మొన్ననే ఇంటికి వచ్చావు.. కదా .. మళ్లీ ఎందుకు అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె ఫోన్ పెట్టేసింది. ఫోన్ చేసి ఇలా ఇంటికి తీసుకెళ్లండి అని ఆమె ఏ కారణం చేత అన్నదో తెలియరాలేదు.. కానీ ఆమె భర్తతో గొడవ పడి శనివారం అర్థరాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించింది. భర్త వేధింపుల కారణంగానే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తును ప్రారంభించినట్లు ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్సై అంజమ్మ తెలిపారు.