Health Benefits: ప్రస్తుత బిజీలైఫ్ లో ప్రతిఒక్కరూ ఒత్తిడి, ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఆఫీస్ వర్కు, పర్సనల్స్ లైఫ్ లతో పాటు తదితర విషయాలకు సంబంధించి ఏవేవో ఆలోచిస్తూ చాలా టెన్షన్స్ పడతారు. ఈ కారణంగా రాత్రి నిద్రపోయే సమయంలో కొంతమందికి నిద్రపట్టదు.

మంచంపై అటు ఇటూ దొర్లినా నిద్రరాక చిరాకు పడతారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే ఇట్టే నిద్రపోతారు. అవేంటంటే.. రాత్రి నిద్రపోయే ఒక గంట ముందు ముక్కులో గోరువెచ్చని ఆవు నెయ్యిని రెండు చుక్కలు వేసుకోండి. దీని వల్ల నిద్ర బాగా వస్తుంది.

మరో రెమిడీలో మీ భాగస్వామితో తల వెంట్రుకలను నెమ్మదిగా నిమురమని చెప్పండి.. సోయి లేకుండా నిద్ర పోతారు. మరో చిట్కాలో.. వంట సామాగ్రికి ఉపయోగించే గసగసాలను దోరగా వేయించి ఒక పలుచని క్లాత్ లో వేసి నిద్రపోవటానికి ముందు వాటి వాసన పీలిస్తే ఇట్టే నిద్ర పడుతుంది.
ఇవి కూడా చేయొచ్చు..
మీ అరికాళ్లను చేతులతో నెమ్మదిగా మర్దన చేసుకుంటే హాయిగా నిద్ర పోతారు. ఇంకా కాళ్లకు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కూడా రాసి మర్దన చేసుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మరీ ముఖ్యంగా చాలామంది నిద్ర పోయే ముందు మొబైల్ ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దాని వల్ల సరిగ్గా నిద్రపట్టదు. కాబట్టి పడుకునే ముందు మొబైల్ వాడొద్దు. తలదిండు పక్కన ఫోన్ అస్సలు పెట్టుకోవద్దు. రేడియేషన్ ప్రభావంతో నిద్రపోరు. ఇంకా పడుకునే ముందు కాసేపు మ్యూజిక్ విన్నా హాయిగా నిద్ర పడుతోంది. పైన చెప్పిన చిన్న చిన్న టిప్స్ ను పాటిస్తూ హాయిగా నిద్రపోండి.




























