తెలుగు సినీ పరిశ్రమలో రోజా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని.. ఇటు రాజకీయాల్లోను.. సినీ పరిశ్రమలోనూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే గా రెండు సార్లు నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె జబర్దస్త్ కామెడీ షో లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ.. కమెడియన్లకు పంచ్ లు వేసి నవ్వుతూ ప్రేక్షకుల్ని నవ్విస్తోంది.

ఇటు రాజకీయాల వైపు కూడా తన కార్యక్రమాలకు హాజరవుతూ.. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే సెల్వమణిని వివాహం చేసుకున్న రోజాకు మొదట అన్షు మాలిక్ తర్వాత కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అన్షు అంటే తనకు ఎంతో ఇష్టమని పలు కార్యక్రమాల్లో ఎన్నో సందర్బాల్లో తెలిపింది.
వారి అభిరుచులకు అనుగుణంగా ఆమె నడుస్తోంది. వాళ్ల ఇష్టాలకు ఏనాడు ఎదురుతిరగలేదు. అందరూ టెక్నాలజీలో తమ ట్యాలెంట్ ను నిరూపించుకుంటూ అటు వైపు వెళ్తుంటే.. రోజా కూతురు అన్షు మాత్రం సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించి భాషపై పట్టు సాధించి సృజనాత్మకతతో ముందుకెళుతోంది. తాజాగా అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది.
ప్రఖ్యాత ఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించడం విశేషం. తను ఎప్పటి నుంచి కలలు కంటున్న ఈ రోజు నెరవేరిందని.. అన్షూ సంతోషం వ్యక్తం చేసింది. ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా క్వీన్ ఆఫ్ టాలెంట్ గా అన్షు ఫోటో ప్రచురించారు. ఇలా ఆమె ఇంతటి గౌరవాన్ని దక్కించుకోవడంతో రోజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కుటుంబసభ్యులతో ఆమె చిన్న పాటి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.































