YS Sharmila: భారతదేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ పై కీలక ఆరోపణలు వెలుగులోకి రావడం.. వాటిలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ కూడా గతంలో భారీ స్థాయిలో ముడుపులు అందుకున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై వైయస్ షర్మిల స్పందించారు.

ఈ విషయం గురించి ఈమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ రాశారు. ఇక ఈ లేఖలో అదానీతో జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని తెలిపారు. ఈ ఒప్పందాల కారణంగా ప్రజలపై రూ. 1.50 లక్షల కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గౌతమ్ అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీ నుంచి 100 కోట్ల రూపాయలు విరాళం అందింది. అయితే ఈయన సిఎస్ఆర్ ఫండ్ కింద సిల్క్ యూనివర్సిటీ కోసమే ఈ విరాళాలను అందుకున్నట్లు తెలియజేశారు కానీ ప్రస్తుతం అదానీ గురించి ఈ విధమైనటువంటి విమర్శలు వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి విరాళాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేశారు.

YS Sharmila:సీబిఐ విచారణ..
ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ ఈమె రాసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ కూడా షర్మిల ఈ లేఖలో పేర్కొన్నారు.
































