కరోనాకు చెక్ పెట్టె 10 శాఖాహారాలు ఇవే!

0
515

ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితులలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలతో పాటు సరైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం.ముఖ్యంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తో ,పాటు జింక్ కూడా అంతే. అయితే జింక్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

విటమిన్లతో పాటు ఇతర పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికమవుతుంది.ఈ విధంగా రోగ నిరోధక శక్తి పెరగడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వాటిపై పోరాడి మన శరీరానికి ఎటువంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్త పడతాయి.ముఖ్యంగా కరోనా సమయంలో ఈ భయంకరమైన మహమ్మారి మనకు వ్యాపించకుండా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు.మరి ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

  • సెనగలు: మన శరీరానికి అధిక మొత్తంలో జింక్ పొందాలనుకునే వారు వారి ఆహారంలో ఎక్కువ భాగం గింజలు వుండే విధంగా చూసుకోవాలి. సెనగలలో జింక్ పుష్కలంగా ఉండడంతో పాటు ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
  • ధాన్యాలు: ముఖ్యంగా గింజలు ధాన్యాలు వంటి వాటిలో కూడా జింక్ అధికంగా ఉంటుంది. వీటిలో ఫ్యాట్ తక్కువగా ఉండి జింక్ ,ఫైబర్, ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి.
  • గుమ్మడి గింజలు: 28 గ్రాముల గుమ్మడి గింజలలో 2.2 మిల్లిగ్రాముల జింక్ లభిస్తుంది. కనుక జింక్ లోపం ఉన్నవారు తరచూ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల తగినంత జింక్ ను పొందవచ్చు.
  • పుచ్చకాయ గింజలు: జింక్, మాక్రోన్యూట్రియంట్స్  పుచ్చకాయ గింజలు ఎక్కువగా ఉంటాయి. ఈ గింజలను ఎండబెట్టి స్నాక్స్ లాగా తీసుకోవటంవల్ల మన శరీరానికి తగినంత జింక్ పొందవచ్చు.
  • జనపనార విత్తనాలు: ఈ విధమైన గింజలలో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి.ఇందులో కరిగిపోని కొవ్వు, జింక్ ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ జనపనార గింజల్లో 1 మిల్లీ గ్రామ్ జింక్ ఉంటుంది. వీటిలో మన శరీరానికి సరిపడే అమైనో యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను దూరం చేస్తాయి.
  • బీన్స్: కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్ లో కూడా ఎక్కువ భాగం జింక్ లభిస్తుంది. ఒక కప్పు ఉడికించిన బీన్స్ లో 0.9 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది.
  • ఓట్స్: ఈ మధ్య కాలంలో ఓట్స్ వినియోగం అధికంగా ఉంది.అధికంగా ఓట్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి జింక్ కూడా అధిక మొత్తంలో అందుతుంది. ఒక కప్పు ఓట్స్ లో 1.3 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.
  • జీడిపప్పు: జీడిపప్పులో కూడా అధిక భాగం జింక్ ఉంటుంది. దీనిని పచ్చిగా తిన్న లేదా వేయించి తిన్నా 1.5mg జింక్ పొందవచ్చు.
  • పెరుగు: పెరుగులో మనకు ఎంతో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన శరీరంలోనికి ప్రవేశించి అధికశాతం జింక్ ను ఉత్పత్తి చేస్తుంది.ఓ కప్పు పెరుగులో 1.5 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.
  • డార్క్ చాక్లెట్: మీరు 100 గ్రాముల డార్క్ చాకొలెట్ తింటే… మీకు 3.3 మిల్లీగ్రాముల జింగ్ పొందవచ్చు.