మనలో చాలామందికి డబ్బు సంపాదించాలంటే ఆశ ఉంటుంది. అయితే ఏ విధంగా సంపాదించాలనే విషయం తెలియక చాలామంది సంపాదించిన డబ్బుపై ఎక్కువ లాభాలకు పొందలేరు. అయితే సరైన విధంగా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను చవిచూడవచ్చు. తక్కువ సమయంలో డబ్బు సంపాదించడానికి స్టాక్ మార్కెట్ కూడా ఒకటి. స్టాక్ మార్కెట్లలో రిస్క్ ఎక్కువగా ఉండటంతో లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వార కేవలం సంవత్సరం కాలంలోనే కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే సమయంలో స్టాక్ మార్కెట్ పై పూర్తిగా అవగాహన ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. మల్టీబ్యాగర్ స్టాక్ ను కనిపెట్టి పెట్టుబడి పెడితే కళ్లు చెదిరే లాభాన్ని గ్యారంటీగా సొంతం చేసుకోవచ్చు. బయోఫిల్ కెమికల్స్ అనే స్టాక్ ధర సంవత్సర కాలంలోనే 28 రెట్లకు పైగా పరుగు పెట్టింది.

గతేడాదిలో ఈ స్టాక్ లో ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఉంటే వాళ్లకు ఏకంగా ఏకంగా 28 రెట్ల లాభం సొంతమవుతుంది. ఈ స్టాక్ పై గతేడాది లక్ష ఇన్వెస్ట్ చేసిన వాళ్లు ఏకంగా 28 లక్షలు, రెండు లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు 56 లక్షలు సొంతం చేసుకున్నారు. స్టాక్ మార్కెట్ పై పూర్తి అవగాహన ఉండి సరైన విధంగా పెట్టుబడులు పెడితే మీరు కూడా ఇంతే మొత్తాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది.

బయోఫిల్ కెమికల్స్ గతేడాది రూ.4.42 దగ్గర ట్రేడ్ కాగా ప్రస్తుతం దాని ధర రూ.126కు పెరిగింది. సంవత్సర కాలంలో ఏకంగా 2768 శాతానికి పైకి పెరిగింది. ఈ కంపెనీకి పోటీగా ఉన్న ఇతర కంపెనీలు మాత్రం వెనకాలే ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here