Featured
పంచదార వాడటం మానేస్తే ఇలాంటి మార్పులు వస్తాయా?
Published
3 years agoon
By
lakshanaమనం ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే మన శరీరం ఉత్తేజితం కాదు. మరి ఉదయం లేవగానే కాఫీ తయారు చేయాలంటే చక్కెర అవసరం. మన నిత్యవసర వస్తువులలో చక్కెర కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామంది చక్కెరతో వివిధ రకాల వంటలను తయారు చేసుకొని తింటుంటారు. చక్కెర అనేది మన నిత్య జీవితంలో ఒక అవసరంగా మారిపోయింది. అయితే పంచదారను తినడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చక్కెర అనేది ఒక మత్తు పదార్థంగా ఉండటం వల్ల చాలామంది చక్కెరకు బానిస అయ్యి పదేపదే తినాలనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే చక్కెరను పూర్తిగా మానేయాలి అని నిపుణులు తెలియజేస్తున్నారు.
మన నిత్యావసరాలలో ఎంతో ప్రాముఖ్యతను చోటుచేసుకున్న చక్కెరను ఒక్కసారిగా మానేయాలంటే ఎంతో ఇబ్బందికరం. కనుక చక్కెర స్థానంలో బెల్లం, పటిక బెల్లం వంటి వాటిని ఉపయోగించడం ద్వారా క్రమంగా చక్కెరను దూరం పెట్టవచ్చు. చక్కెరతో వివిధ రకాల వంటలను తయారు చేసుకుని తినాలి అనుకునేవారికి మరీ మరీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా చక్కెరను అతిగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కనుక పూర్తిగా చక్కెరను మానేయాలి.
చక్కెరను క్రమంగా తగ్గిస్తూ రావడం వల్ల మన దృష్టి మొత్తం ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల వైపు మళ్ళుతుంది. ఈ క్రమంలోనే మన శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చక్కెరను దూరం పెట్టిన తరువాత ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలను తీసుకోవాలి. ఈ విధంగా తాజా కూరగాయలను తీసుకోవటంవల్ల మన శరీరానికి ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ పూర్తిస్థాయిలో అందుతాయి.
ఈ పంచదారను దూరంచేసి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనలో కలిగే ఒత్తిడి, ఆందోళన, అనేవి క్రమంగా తగ్గిపోతాయి. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు శాతం కరిగిపోయి శరీర బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. అందుకోసమే పంచదారకు బదులుగా నల్ల బెల్లం, పటిక బెల్లం, బెల్లం వాడాలి. అయితే మనం తీసుకొనే ఆహారంలో కేవలం 20 శాతం మాత్రమే ఉండేలా చూసుకోవాలి అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.
You may like
Coconut water: కొబ్బరి నీటితో ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు కూడా ఉన్నాయి.
Betel Nut Leaves : తమలపాకులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే షాక్ అవుతారు..!
Health Benefits: రాత్రి నిద్ర పట్టడం లేదా..! ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి…!
Health Benefits: కొర్రల అన్నం తినే అలవాటు ఉందా..! అయితే ఈ వ్యాధి మీకు దరి చేరదు..!
Health Benefits: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..! అయితే మీ శరీరంలో నీరు లేనట్లే..?
Apple Benefits: మీరు ప్రతిరోజు యాపిల్ పండును తింటున్నారా…అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే!
Featured
Rana: మహేష్ కోసం మరోసారి రానాను విలన్ ను చేయబోతున్న జక్కన్న?
Published
8 hours agoon
14 October 2024By
lakshanaRana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న రానా ఇటీవల కాలంలో హీరోగా మాత్రమే కాకుండా కథ పాత్ర బలంగా ఉంటే విలన్ పాత్రలలో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి సినిమాలో భల్లాళ్ల దేవుడి పాత్రలో నటించి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన రానాని రాజమౌళి మరోసారి విలన్ ను చేయబోతున్నారని తెలుస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో త్వరలోనే మహేష్ బాబుతో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో కూడా రాజమౌళి ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ఓ అడ్వెంచరస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ కూడా చాలా భిన్నంగా ఉంది. ఇక ప్రభాస్ కు పెద్ద ఎత్తున పోటీ పడిన రానా మహేష్ బాబుకి కూడా గట్టి పోటీ ఇస్తారని చెప్పాలి. మరి రానా ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
విలన్ గా రానా..
ఇక రాజమౌళి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. RRR సినిమాలోని ఒక పాటకు మాత్రమే ఆస్కార్ వచ్చింది కానీ ఈ సినిమా మాత్రం అన్ని విభాగాలలో ఆస్కార్ కు ఎంపిక అయ్యే విధంగా రాజమౌళి సినిమా కోసం కష్టపడుతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం.
Featured
Lavanya Tripathi: మెగా ఇంట్లోకి రాబోతున్న బుల్లి వారసుడు.. తల్లి కాబోతున్న లావణ్య!
Published
8 hours agoon
14 October 2024By
lakshanaLavanya Tripathi: మెగా ఇంట్లోకి మరో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించిన విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే మరో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా అమ్మ కాబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
నటి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ప్రేమలో పడి పెద్దల సమక్షంలో గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ ఎంతో ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఇలా ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి పెద్దగా సినిమాలలో నటించలేదు.
ఇలా ఈ జంట పెళ్లి చేసుకొని దాదాపు ఏడాది అవుతున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఈ వార్త వైరల్ అవుతుంది. అతి త్వరలోనే లావణ్య త్రిపాఠి అమ్మగా ప్రమోట్ అవ్వబోతుందని తెలుస్తోంది. దసరా పండుగను పురస్కరించుకొని ఈ శుభవార్తను తన అత్తమామలతో లావణ్య త్రిపాఠి తెలిపారని సమాచారం. ఇలా లావణ్య త్రిపాఠి తల్లి కాబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తల్లి కాబోతున్న లావణ్య..
ఇకపోతే ఈమె తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ ప్రకటించలేదు దీంతో ఇలాంటి విషయాలను అధికారకంగా ప్రకటిస్తేనే మంచిది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె తల్లి కాబోతున్నారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక లావణ్య త్రిపాటి సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన వరుణ్ తేజ్ మాత్రం వరుస సినిమాలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈయన మట్కా అనే సినిమా ద్వారా రాబోతున్నారు.
Featured
Chanti: చావు బతుకుల్లో ఉంటే ఒక్కరు సహాయం చేయలేదు.. నాశనమైపోతారు: చలాకి చంటి
Published
8 hours agoon
14 October 2024By
lakshanaChanti: ఎన్నో సినిమాలలో కమెడియన్ గా చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన చలాకీ చంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న చంటి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఇలాంటి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన బయట ఎక్కడా కనిపించలేదు.
బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే అనారోగ్యానికి గురైన చంటి ఇప్పుడే కోలుకొని పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టారు. తాను తీవ్రమైన గుండెపోటుకు గురై హాస్పిటల్ పాలయ్యానని తెలిపారు. అలా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న తనని పరామర్శించడానికి కానీ నాకు సహాయం చేయడానికి గానీ ఏ ఒక్కరు ముందుకు రాలేదని తెలిపారు.
ప్రస్తుత కాలంలో డబ్బు ఉంటేనే మనం బ్రతుకుతాం ఎవరైనా మనల్ని పలకరిస్తారు. డబ్బు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరని చంటి తెలిపారు. మన పరిస్థితి బాగా లేకపోతే స్నేహితులు ఎవరూ కూడా ముందుకు రారు. అందుకే ఎవరి దగ్గర డబ్బు ఆశించకుండా బ్రతకడం నేర్చుకోవాలని తెలిపారు. ఇక తాను ఇండస్ట్రీలో కొనసాగే సమయంలో చాలామంది నాపై నాకు తెలియకుండానే కుట్రలు చేశారని తెలిపారు.
జబర్దస్త్ లోకి రాను..
నా గురించి దర్శక నిర్మాతల వద్ద తప్పుగా చెబుతూ నాకు సినిమాలలో అవకాశాలు లేకుండా చేశారు. ఇలా ఎన్నో అవకాశాలను కోల్పోయానని నాకు ఇలా అవకాశాలు రాకుండా చేసిన వారు సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్థాలు పెట్టారు. నేను బ్రతికుండగానే నన్ను ఇబ్బందులు పెట్టినవారు నాశనాన్ని నేను చూసి చనిపోవాలి అంటూ చలాకి చంటి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక తిరిగి జబర్దస్త్ కి మీరు వస్తారా అనే ప్రశ్న ఎదురు కావడంతో నేను రానని వాళ్లే వద్దన్నప్పుడు నేను మరోసారి అడగను అంటూ చంటి జబర్దస్త్ రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు.
Rana: మహేష్ కోసం మరోసారి రానాను విలన్ ను చేయబోతున్న జక్కన్న?
Lavanya Tripathi: మెగా ఇంట్లోకి రాబోతున్న బుల్లి వారసుడు.. తల్లి కాబోతున్న లావణ్య!
Chanti: చావు బతుకుల్లో ఉంటే ఒక్కరు సహాయం చేయలేదు.. నాశనమైపోతారు: చలాకి చంటి
Tejaswini: నాన్నని ఎంతో అవమానించారు… నాన్న సక్సెస్ తో సమాధానం చెప్పారు: తేజస్విని
Unstoppable: బాబాయ్ షోలో అబ్బాయ్… ఓకే వేదికపై రచ్చ చేయనున్న నందమూరి హీరోలు?
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
Roja: తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: రోజా
Tirupathi Laddu: తిరుపతి లడ్డు వివాదం.. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్?
Chandra Babu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్!
Trending
- Featured3 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured2 weeks ago
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
- Featured2 weeks ago
Tirupathi Laddu: తిరుపతి లడ్డు వివాదం.. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్?
- Featured2 weeks ago
Roja: తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: రోజా
- Featured2 weeks ago
Chandra Babu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్!
- Featured4 weeks ago
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్..హింట్ ఇచ్చిన తమన్ సంతోషంలో అభిమానులు!
- Featured3 weeks ago
Anasuya: ఆ విషయంలో ఆ హీరో బాగా ఒత్తిడి చేశాడు… సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ!
- Featured4 weeks ago
Kumari Aunty: వరద బాధితులకు అండగా కుమారి ఆంటీ.. ఎంత సాయం చేశారో తెలుసా?