ABV: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇటీవల జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరు గురించి విమర్శలు వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసేలా పోలీస్ శాఖను ప్రయోగిస్తున్నారన్నారు.

అరెస్టులపై సీఎం చంద్రబాబుకు సలహాలు ఇచ్చేందుకు ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, నియమించారని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ పేర్లను ఉచ్చరించి ఏక వచనంతో జగన్ సంభోదించారు.
ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకుని పక్కా ప్రణాళికతో అరెస్టుల పర్వం సాగిస్తున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించి సోషల్ మీడియా వేదికగా జగన్ కి వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. ముందు మీ మాట మీ భాష సరి చేసుకో. ఒకసారి ప్రజలలో విశ్వాసం కోల్పోయిన మాట జారిన వెనక్కి తిరిగి తీసుకురాలేము.

ABV: సంస్కారం లేకుండా..
నీలాగా సంస్కారం లేకుండా నేను మాట్లాడలేను నేనేంటి అనేది గత ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చూసావు. బి కేర్ఫుల్ అంటూ ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు. మీరూ నన్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని అది పూర్తిగా అబద్ధం అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.
































