మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న “ఆచార్య” సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల చిత్ర నిర్మాణం వాయిదా పడుతూ వస్తుంది.అయితే ప్రస్తుతం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృందం ఈ సినిమాకి సంబంధించిన తాజా సమాచారం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం చిత్రబృందం ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేసింది.

ఆచార్య సినిమాకు సంబంధించిన టీజర్ జనవరి 29న సాయంత్రం విడుదల చేయనున్నట్లు దర్శకుడు కొరటాల శివ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తున్న సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోని బుధవారం విడుదల చేశారు. ఈ విధంగా ఆచార్య టీజర్ విడుదల తేదీని ప్రకటించడంతో మెగా అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. తొందరలోనే చిత్ర నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేసింది.

దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌, నిరంజన్‌ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఇక పోతే ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించనున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, భారీ ఆలయ సెట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here