Actor Naresh: నటుడు నరేష్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు దూరంగా ఉంటూ మరొక నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా నరేష్ పవిత్ర రిలేషన్ లో ఉండడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే వీలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ రచ్చ చేశారు.గత ఏడాది డిసెంబర్ 31వ తేదీఈ జంట లిప్ లాక్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ వీడియోని షేర్ చేసిన నరేష్ త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానని తెలిపారు. ఇక ఈ వీడియో గురించి మర్చిపోకముందే ఈయన పవిత్ర లోకేష్ నుపెళ్లి చేసుకున్నటువంటి వీడియోని షేర్ చేశారు.
ఈ వీడియో చూసినటువంటి నెటిజెన్స్ నరేష్ అనంతపని చేశారు అంటూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇకపోతే చాలామంది వీరిద్దరి నిజంగా పెళ్లి చేసుకోలేదని ఎదైనా సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఇలా చేసి ఉంటారని భావించారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఈయన పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోలేదని తాజాగా క్లారిటీ ఇచ్చారు.

Actor Naresh:మళ్లీ పెళ్లి…
వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో విడుదల కాబోతుంది ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పెళ్లి వీడియో పై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.