Actor Naresh: ప్రముఖ నటి విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన నరేష్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఏడాదికాలంగా నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

మొదటి ఇద్దరి భార్యలకు చట్టపరంగా విడాకులు ఇచ్చిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి చట్టపరంగా విడాకులు ఇవ్వకుండానే క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు.
ఈ విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి రిలేషన్ గురించి నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా కాలంగా వీరి ముగ్గురి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో కలిసి నటించిన నరేష్, పవిత్ర లోకేష్ తాజాగా ‘ మళ్లీ పెళ్లి ‘ సినిమాలో జంటగా నటించారు. నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే నరేష్ మాత్రం ఇది తన బయోపిక్ కాదని ఖండిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి నరేష్ నిర్మాతగా వ్యవహరించాడు.

Actor Naresh: వేల కోట్ల ఆస్తులు….
ఈ క్రమంలో నరేష్ ఆస్తుల వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నరేష్ కి తల్లి విజయనిర్మల ఇచ్చిన ఆస్తులు మాత్రమే కాకుండా తాను సినిమాలలో నటించి సంపాదించిన ఆస్తులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్ కి వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తులు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అయితే నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ క్రమంలో ఈ సినిమా లో ఒక సన్నివేశంలో ‘ మీకెంటి సర్ 1000 కోట్ల ఫిగర్ ‘ అనే డైలాగ్ బట్టి చూస్తే నరేష్ కి వేలకోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నరేష్ ఆస్తులు వివరాల తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.