Actress Pragathi: తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న ప్రగతి తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలియజేశారు.

ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడుతూ తాను కెరియర్ మొదట్లో పలు తమిళ సినిమాలలో నటించానని అయితే కొన్ని కారణాలవల్ల తనకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డానని తెలిపారు. ఇక తాను ఎలాంటి పాత్రలలో నటించిన తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తానని ఈమె పేర్కొన్నారు.ఇకపోతే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ తన భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిగా పిల్లల బాధ్యత తనపై వేసుకొని వారికి ఏ లోటు లేకుండా పెంచానని ఈమె వెల్లడించారు.
ఇకపోతే కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయితే కరోనా సమయంలో తాను కూడా ఒకవైపు అవకాశాలు లేక మరోవైపు ఆర్థిక ఇబ్బందులు చుట్టూ ముట్టడంతో ఎంతో సతమతమయ్యానని అలాంటి సమయంలో నగలు అమ్మి పిల్లల ఇబ్బందులను తీర్చానని ఈ సందర్భంగా ప్రగతి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Actress Pragathi: కష్టాలు రావడం సాధారణం…
ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు రావడం సర్వసాధారణం అయితే ఎప్పుడైతే ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడతామో అప్పుడే కొందరికి ఆదర్శమవుతామని ఈ సందర్భంగా ప్రగతి తాను కరోనా సమయంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఒడిదుడుకులను గురించి ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


































