ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో వరుస సినిమాలతో ఓ కొత్త ట్రెండ్ ను స్పష్టించారు హీరోయిన్ త్రిష. ప్రస్తుతం అరకోర సినిమాలు మాత్రమే తీస్తూ.. తెలుగు సినిమాలకు దాదాపు దూరంగానే ఉన్నారనే చెప్పాలి. సినిమా హిట్ అయినా.. ఫ్లాఫ్ అయినా కొంతమంది తనకు వచ్చిన రెమ్యూనరేషన్ తో ముందుకు సాగుతుంటారు. ఇంకా హిట్ అయినప్పుడు వచ్చే ప్రశంసల్లో మునిగి తేలకుండా.. ప్లాప్ లను కూడా అదే రకంగా తీసుకుంటారు. ఇలా వాళ్లు అభిమానులను సంపాదించుకుంటారు.

ఇటీవల ప్రభాస్ అభిమాని ఒకరు రాధేశ్యామ్ గురించి ఏ అప్ డేట్ రావట్లేదు అంటూ ఓ సూసైడ్ నోట్ రాయడం పెద్ద వైరల్ గా మరింది. తర్వాత రెండు రోజులకు ఆ సినిమా నుంచి పెద్ద అప్ డేట్ వచ్చేసింది. ఇలా తమ నటులను విపరీతంగా ఆరాదిస్తారు. ఈ క్రమంలో తారలు కూడా అంతే తమ ఫ్యాన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు.
ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. అభిమానులు బాధపడతారేమోనని.. కొన్ని నిర్ణయాలను తీసుకోవడం మానేస్తారు. ఒకప్పుడు సినీ ప్రముఖులను కలవాలంటే ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ నేటి సోషల్ మీడియా యుగంలో స్టార్స్, ఫ్యాన్స్ మధ్య దూరం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. నేరుగా మాట్లాడుతున్నారు.. చాట్ చేస్తున్నారు.. తమ సమస్యలను కూడా చెబుతున్నారు. తాజాగా త్రిష తమ అభిమాని గురించి చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
I am so devastated about this???? Rip my brother and thank you for being you. https://t.co/OUiTSXXtco
— Trish (@trishtrashers) November 14, 2021
అదేంటంటే.. ఆమె వీరాభిమాని అయిన కిషోర్ అనే వ్యక్తి మరణించాడు. ఆమెకు సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉందంటే కారణం అతడేనట. ఆ వార్త వినగానే తన గుండె బద్దలైందన్నట్టుగా ఆమె ట్వీట్ చేశారు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ త్రిష ఎమోషనల్ అయ్యారు. ఈ ట్వీట్ వైరల్ అయింది.
































