ఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 11జీబీ డేటా..?

0
151

జియో ఎంట్రీతో దేశీయ టెలీకాం రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో 1జీబీ డేటాకు వందల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొనగా జియో ఎంట్రీతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పోటీతత్వం వల్ల కస్టమర్లకు నాణ్యతతో కూడిన సర్వీసులు లభిస్తున్నాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

తాజాగా ఎయిర్ టెల్ కొత్తగా ఎయిర్ టెల్ లోకి చేరే కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 4జీ సిమ్ తీసుకున్నా 4జీ సిమ్ కు అప్ గ్రేడ్ అయినా ఏకంగా 11 జీబీ డేటాను ఉచితంగా పొందే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. అయితే కేవలం పోస్ట్ పెయిడ్ యూజర్లు మాత్రమే ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం పొందడం సాధ్యమవుతుంది. రెండు విడతలో కొత్త యూజర్లు 11జీబీ డేటాను పొందగలుగుతారు.

కొత్తగా ఎయిర్ టెల్ 4జీ సిమ్ తీసుకున్న కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా 5జీ డేటా వస్తుంది. ఐదు 1జీబీ డేటా కూపన్ల రూపంలో యాప్ లో ఈ డేటా క్రెడిట్ అవుతుంది. యాప్ లో క్రెడిట్ అయిన మూడు నెలల్లో ఈ డేటాను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకపోతే మాత్రం 2జీబీ డేటాను మాత్రమే పొందడం సాధ్యమవుతుంది.

ఈ ఆఫర్ తో పాటు ఎయిర్ టెల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ కస్టమర్లు 598 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజీలతో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ డేటా ఉచితంగా పొందే ఛాన్స్ ఉంటుంది. రూ.399 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే నాలుగు కూపన్లు, రూ.219తో రీచార్జీ చేసుకుంటే రెండు కూపన్లు లభిస్తాయి. అయితే ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ తో రీచార్జీ చేసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తగా 4జీ కనెక్షన్ తీసుకుని 598 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్ ను రీఛార్జీ చేసుకుంటే 11జీబీ డేటా పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here