Allu Aravind: సరదాగే అన్నాను… లావణ్య సీరియస్ గా తీసుకొని మావాడినే చూసుకుంది… అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

0
226

Allu Aravind: నటి లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీరిద్దరూ గత నెల తొమ్మిదవ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. వీరిద్దరూ నిశ్చితార్థమైన తర్వాత అల్లు అరవింద్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.చావు కబురు చల్లగా సినిమా వేడుకలో భాగంగా అల్లు అరవింద్ లావణ్య గురించి మాట్లాడుతూ పలు కామెంట్స్ చేశారు.

తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు ఇక్కడే ఒక తెలుగు అబ్బాయిని చూసి సెటిల్ అయిపో అంటూ మాట్లాడారు. ఈ వీడియో లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం తర్వాత బాగా వైరల్ అయింది. ఇక ఈ వీడియోని అల్లు అర్జున్ షేర్ చేస్తూ మా నాన్నకు విజినరీ ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అల్లు అరవింద్ లో బేబీ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి అల్లు అరవింద్ కు ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ మాట్లాడుతూ…లావణ్య త్రిపాఠి చాలా మంచి అమ్మాయి మా బ్యానర్లో మూడు సినిమాలు చేసింది. అదే చదువుతోనే ఆ రోజు నేను ఏదో సరదాగా అంటే ఆ అమ్మాయి సీరియస్ గా తీసుకొని చివరికి మా వాడిని చూసుకుంది అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Allu Aravind: త్వరలోనే వరుణ్ లావణ్య వివాహం..


అల్లు అరవింద్ ఆరోజా అలా మాట్లాడారు అంటే బహుశా ఈయనకు వరుణ్ తేజ్ లావణ్య విషయం ముందుగానే తెలిసి ఉంటుంది. ఇక తన ఫ్యామిలీ మెంబర్ కావడంతో ఈ విషయం తెలిస్తే అల్లు అరవింద్ అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. గత నెల ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న వరుణ్ లావణ్య మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.