Allu Arjun: ఒడిశా రైలు ఘటన అందరినీ ఎంతగానో కలిసివేస్తుంది. ఒకేసారి మూడు రైలు ఢీకొట్టడంతో భారీ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలు కాగా వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. క్షణక్షణానికి మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది.

ఇలా నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన అందరినీ ఎంతో కలిసి వేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నారు.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ వంటి వారు ఈ ఘటనపై స్పందించి వెంటనే అక్కడ వారికి సహాయం చేయాలని బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు.
ఇక ఈ ఘటనపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ తమ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు అల్లు అర్జున్ సైతం ఈ రైలు ఘటన పై స్పందించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Allu Arjun: త్వరగా కోలుకోవాలి..
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫైటర్ వేదికగా స్పందిస్తూ ఒడిస్సాలో జరిగిన రైలు ఘటన చూసి ఒక్కసారిగా నా గుండె పగిలిపోయింది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ ఈ రైలు ఘటనపై స్పందిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Shocked & heart broken by the tragic train accident in Odisha. My condolences to the families who have suffered the loss of their loved ones. Sending heartfelt prayers for the recovery of those who were injured.
— Allu Arjun (@alluarjun) June 3, 2023