Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద హత్య కేసులో నిన్న రిమాండ్ ముగియడంతో ఎర్ర గంగిరెడ్డిని మళ్ళీ చెంచల్ గూడా జైలుకి తరలించారు పోలీసులు. అయితే ఆల్రడీ అక్కడ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. అవినాష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డి, అలాగే హాస్పిటల్ లో నర్స్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డిని అదే జైల్లో ఉంచారు. ఇక జైల్లో కలిసిన ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారు లాంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డికి పడదు…
వివేకానంద కు ఎపుడూ నీడలాగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి అవినాష్ రెడ్డి వర్గమైన భాస్కర్ రెడ్డికి పడదు అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. వివేకానంద ఎమ్మెల్సి ఎలక్షన్స్ లో పోటీ చేసినపుడు కూడా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి ఉమా శంకర్ రెడ్డి వర్గం ఆయనను ఓడించారు. అపుడు కూడా వివేకానంద రెండో భార్య షమీమ్ తో తన వల్లే తనను ఓడించారని చెప్పారట. అలా ఇరు వర్గాలైన ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి జైల్లో కలవడంతో చర్చనీయాంశం అయింది.

అయితే వివేకానంద హత్య తరువాత ఎర్ర గంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి వర్గంతో సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం జగన్ కూడా అవినాష్ వర్గంకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం భాస్కర్ రెడ్డి దగ్గగర అనుకువుగానే ఉంటారని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక కోర్టులకు వేసవి సెలవులు కావడం వల్ల నెల రోజులు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి అంటూ చెప్పారు. ఇక విఐపి లాగా వారిని చూడకూడదని పోలీసులకు ఆర్డర్ వెళ్ళింది కానీ సెక్యూరిటీ మాత్రం విఐపికి ఇచ్చినట్లు ఇవ్వాల్సిన పరిస్థితి అంటూ బాలాజీ తెలిపారు.