కొడుకు మాటతో కన్నీరుమున్నీరైన అనసూయ.. ఏం జరిగిందంటే..?

0
258

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర యాంకర్ గా యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ షోను హోస్ట్ చేసినా అనసూయ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెరపై కూడా విజయాలు సొంతం చేసుకుంటున్న అనసూయ కొడుకు మాటతో కన్నీరుమున్నీరయ్యానని తాజాగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

యాంకర్ అనసూయ అంతలా బాధ పడటానికి కారణమేమిటంటే ఆమె తొమ్మిదేళ్ల కొడుకు అనసూయతో కరోనా వైరస్, లాక్ డౌన్, వరదల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో అనసూయ కొడుకు ఆమెతో తాను గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. 2017, 2018, 2019 సంవత్సరాలలో తాను ఎంతో సంతోషంగా జీవించానని తనకు మళ్లీ అలాంటి రోజులు కావాలని తల్లికి తెలిపాడు. అప్పుడు కరోనా, వరదలు లేకపోవడంతో సంతోషంగా జీవనం సాగించానని చెప్పాడు.

అవకాశం వస్తే తాను గడిచిన వెళ్లాలని అనుకుంటున్నానని కొడుకు తనతో చెప్పాడని ఆమె వెల్లడించారు. కొడుకు అలా చెప్పిన తర్వాత తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని.. కన్నీరు పెట్టుకున్నానని తెలిపారు. రాబోయే తరాల వారికి మనం ఏం అందించనున్నాం…? మనం ఎలాంటి పరిస్థితులను కొని తెచ్చుకున్నానం..? అంటూ ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం మనుషుల జీవితంలో భాగమైపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గతేడాదిలా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. దేశంలో కరోనా అంతమైతే మాత్రమే ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించగలిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here