అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో A-34 నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు, టీడీపీలోని పలువురు అగ్ర నాయకులతో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కేసు మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది.

వైరల్ అవుతున్న ఫొటోలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారితో సన్నిహితంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలు వివిధ సందర్భాల్లో తీసినవిగా తెలుస్తోంది.
రాజకీయ దుమారం, నెటిజన్ల స్పందన
గతంలో వెంకటేష్ నాయుడు భారీగా డబ్బులు లెక్కపెడుతున్న వీడియో వెలుగులోకి రావడంతో ఈ కేసుపై ఉత్కంఠ పెరిగింది. ఇప్పుడు ఈ రాజకీయ నేతలతో ఉన్న ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. నెటిజన్లు “తీగ లాగితే డొంక కదులుతోంది,” “ఇప్పుడే మొదలైంది అసలు గేమ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ పరిణామం లిక్కర్ స్కామ్ దర్యాప్తును ఏ మలుపు తిప్పుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.
లిక్కర్ స్కామ్‌లో టీడీపీ నేతలతో నిందితుడి ఫొటోలు వైరల్
— TeluguDesk (@telugudesk) August 4, 2025
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో కొత్త మలుపు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో A-34 నిందితుడు వెంకటేష్ నాయుడు టీడీపీ టాప్ నేతలైన చంద్రబాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ లతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్… pic.twitter.com/x6dKdDPD7Z






























