ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారా.. అయితే ఇవి పాటించాల్సిందే..!

0
290

సాధారణంగా ఏవైనా ముఖ్యమైన పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మన పెద్దలు కొన్ని నియమాలను పాటించాలని చెబుతుంటారు.ఆ విధంగా చేయడం వల్ల అనుకున్న కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా పూర్తవుతాయని భావిస్తారు. అయితే వారంలో ఏ రోజు బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళడం ద్వారా మంచి జరుగుతుందనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తమలపాకును నమలటం లేదా జేబులో ఉంచుకొని వెళ్ళటం ద్వారా పనులు సకాలంలో పూర్తవుతాయి. అదేవిధంగా సోమవారం ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు మీ ముఖాన్ని ఒక సారి అద్దంలో చూసుకొని వెళ్లటం వల్ల మంచి జరుగుతుంది.

మంగళవారం ఎటువంటి ముఖ్యమైన పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ కొన్ని అత్యవసర పరిస్థితులలో పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు కొద్దిగా తీపి పదార్థం తీసుకోవటం ద్వారా సజావుగా జరుగుతాయి. బుధవారం ఇంటినుంచి బయటకు వెళ్లే సమయంలో పుదీనా, లేదా కరివేపాకును నమలడం ద్వారా శుభం జరుగుతుంది. గురువారం ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లే సమయంలో కొద్ది మొత్తంలో ఆవాలు, జీలకర్ర నోట్లో వేసుకొని నమాలకుండా గుమ్మం దాటే వరకు అలాగే ఉంచుకోవాలి.

శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో కొద్దిగా పెరుగును తిని వెళ్లాలి. అదేవిధంగా శనివారం ఇంటి నుంచి బయటకు ముఖ్యమైన పనుల కోసం వెళ్లేవారు కొద్దిగా అల్లం తురుమును నెయ్యితో కలుపుకొని తినడం ద్వారా అనుకున్న పనులు నెరవేరుతాయి.ఈ విధంగా వారంలో ఏ రోజు బయటకు వెళ్లాలనుకుంటే పైన చెప్పిన పదార్థాలను తిని వెళ్లడం ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా పనులు సజావుగా జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.