Artist Lohith Kumar : ప్రొడ్యూసర్స్ ఇచ్చిన బౌన్స్ అయిన చెక్కులు, నా దగ్గర కుప్పలు కుప్పలు ఉన్నాయ్…: నటుడు లోహిత్ కుమార్

0
74

Artist Lohith Kumar : తెలుగులో మిమిక్రి ఆర్టిస్ట్ గా అటు సినిమాల్లోను ఇటు బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి లోహిత్ కుమార్ రెడ్డి. కమెడియన్ వేణు మాధవ్ గారి చొరవతో మిమిక్రి ఆర్టిస్ట్ గా పట్టాభి గారి దగ్గర చేరిన లోహిత్ గారు ఆతరువాత బాపు వంటి పెద్ద డైరెక్టర్ కు అసోసియేట్ గా చేరారు ఇక ఆ తరువాత బాపు గారు తీసిన శ్రీ నాథ కవి సార్వభౌమ కథ సినిమాలో అవకాశం ఇచ్చిన వివిధ కారణాలతో చేయలేదు. ఇక మళ్ళీ ఆయన దర్శకత్వంలోనే బుడుగు సీరియల్ లో హీరోగా చేసారు. ఇక ఆశల పల్లకి అనే సినిమాలో హీరోగా చేసినా లోహిత్ గారు ఆ సినిమాలకు నంది అవార్డులు కూడా వచ్చాయి.

ప్రొడ్యూసర్స్ చాలా మంది డబ్బు ఎగొట్టారు…

ఎంతో మందిని మిమిక్రి ద్వారా అనుకరించే లోహిత్ గారికి కమల్ హాసన్ ను అనుకరించడం చాలా ఇష్టమట. ఇక లోహిత్ గారి పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది వివిధ శబ్దాలను ప్రతి ఐదు సెకండ్లకు మారుస్తూ ఎక్కువ సమయం చేశారట. ఇక సినిమాల్లోను సీరియల్స్లోను ఎక్కువగా మనకు పరిచయం అయినా లోహిత్ గారు చాలా సినిమాల్లో మొదట అవకాశం ఇచ్చి చివర్లో వేరే వాళ్ళను పెట్టుకున్న సందర్బలు ఉన్నాయని చెప్పారు.

అలాగే పని చేయించుకుని రెమ్యూనరేషన్ ఎగొట్టిన చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారంటు చెప్పారు. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇచ్చిన బౌన్స్ అయినా చెక్కులు నా దగ్గర ఇప్పటికి చాలా ఉన్నాయని అవన్నీ చూపిస్తే ఇంకో ప్రోగ్రాం చేయొచ్చు అంటూ లోహిత్ అయన అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.