ప్రస్తుతం దేశంలో ఆర్యా రాజేంద్రన్ అనే్ యువతి పేరు మారుమ్రోగుతోంది. దేశంలో అతిపిన్న వయస్సులో మేయర్ పదవికి ఎంపికైన యువతిగా ఒక యువతి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం నగరానికి ఆర్యా రాజేంద్రన్ మేయర్ కానున్నారు. సీపీఎం నుంచి పోటీ చేసిన ఆర్యా రాజేంద్రన్ విపక్ష కూటమి నుంచి సీనియర్ అభ్యర్థి బరిలో నిలిచినా విజయం సాధించారు.

అదృష్టం కలిసిరావడంతో ఆర్యా రాజేంద్రన్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు ఎన్నికలు జరగగా ఎల్డీఎఫ్ పార్టీ 516కు పైగా స్థానాలలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తిరువనంతపురంలోని ముడవల్ ముగన్ వార్డ్ నుంచి సీపీఎం తరపున ఆర్యా రాజేంద్రన్ పోటీ చేశారు.
ఎల్డీఎఫ్ పెద్దలు యువతరానికి పెద్దపీట వేయాలని భావించి ఆర్యా రాజేంద్రన్ కు మేయర్ పదవి ఇస్తున్నట్టు నేడు ప్రకటించారు. గతంలో 23 సంవత్సరాలకే మేయర్ పీఠాన్ని అధిరోహించిన రికార్డు అలహాబాద్ కు చెందిన అభిలాష గుప్తాకు ఉండగా ఆర్య ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఆర్యా బీఎస్సీ మ్యాథమాటిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి ఆర్యాకు రాజకీయాలంటే ఎంతో ఆసక్తి.
ఆర్యా రాజేంద్రన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కూడా కావడం గమనార్హం. తనకు అతిపిన్న వయస్సులో మేయర్ పోస్టు ఆర్యా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ పోస్టులో చేరడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ఆర్యా మీడియాకు వెల్లడించారు.



































