ప్రస్తుతం ఏ సెలబ్రిటీ నోట చూసిన, ఏ సోషల్ మీడియాలో చూసిన వినిపించే పాట ఏమిటంటే..‘బచ్ పన్ కా ప్యార్ హై’ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పాటను చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్ డిర్డో అనే కుర్రాడు తన పాఠశాలలో పాడాడు.ఈ విధంగా స్కూల్ లో పాడిన పాటకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో చాలామంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. మరి సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ కుర్రాడు కూడా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ బుడ్డోడు పాడిన ఈ పాట ఎంతో మంది నెటిజన్లను సెలబ్రిటీలను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ బుడ్డోడు పాడిన పాటకు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కూడా ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే అనుష్క శర్మ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫన్నీ మీమ్ షేర్ చేశారు. రాత్రి ప్రశాంతంగా నిద్ర పోదాం అనుకుంటే.. ‘బచ్‌పన్ కా ప్యార్ హై’ అనే పాట నా నోటిలోనే నానుతూ నాకు నిద్రపట్ట నివ్వకుండా చేస్తోంది. అంటూ ఒక మీమ్ షేర్ చేశారు.ఎంత ప్రయత్నించినా ఆ పాటను తన మైండ్లో నుంచి తొలగించలేకపోతున్నానని ఈ సందర్భంగా నటి అనుష్క శర్మ ద్వారా తెలియజేశారు.
ప్రస్తుతం అనుష్క విరాట్ కోహ్లీతో కలిసి బ్రిటన్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా అనుష్క శర్మ షేర్ చేసిన ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే బుడ్డోడు హసదేవ్ డిర్డో పాడిన ఈ పాట పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక
చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ ఆ కుర్రాడిని తన వద్దకు పిలిపించుకుని పాట పాడించుకుని మరి విన్నారు. ఈ క్రమంలోనే కుర్రాడికి భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు.





























