Bandla Ganesh: బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంది. ఇకపోతే ఈయన చేసే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ నటి జీవిత రాజశేఖర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జీవిత రాజశేఖర్ సినీ ప్రస్థానం ఎలాంటిదో మనకు తెలిసిందే.ఇక ఏ విషయం గురించే అయినా జీవిత స్పందిస్తూ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపిన జీవిత తాజాగా బిజెపి తీర్థం పుచ్చుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం బండి సంజయ్ చేసిన పాదయాత్రలో భాగంగా జీవిత పాల్గొని అధిష్టానం తనకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అదేవిధంగా కెసిఆర్ ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైనటువంటి మంచి చేయలేదని కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా తెలంగాణలోని ప్రముఖ పబ్బులు క్లబ్ లలో కేటీఆర్ కు వాటా ఉందంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandla Ganesh: ఆదర్శ దంపతులు…
ఈ క్రమంలోనే జీవితం చేసిన ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ స్పందిస్తూ తన ట్విట్టర్ ద్వారా జీవిత రాజశేఖర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ… లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీని మర్చిపోయినట్టున్నారు… మన రాష్ట్రంలో ఎన్ని పార్టీ జెండాలు ఉన్నాయో అన్ని జెండాలు మెడలోనే వేసుకున్నారు ఆదర్శ దంపతులు అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ జీవిత రాజశేఖర్ గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ విషయంపై జీవిత స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
లక్ష్మీపార్వతి పెట్టిన అన్న ఎన్టీఆర్ పార్టీ మర్చిపోయినట్టున్నారు,, మన రాష్ట్రంలో పార్టీ జెండాలు ఎన్ని ఉన్నాయో అన్ని జెండాలు మెడలో వేసుకున్నారు,, ఆదర్శ దంపతులు ???? https://t.co/feRHGvh0Jx
— BANDLA GANESH. (@ganeshbandla) August 25, 2022


































