Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా భావిస్తూ తరచూ పవన్ నామస్మరణ చేస్తూ ఉండే బట్ల గణేష్ కు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తో విభేదాలు వచ్చాయని అందుకే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో పవన్ గురించి బండ్ల గణేష్ ప్రస్తావించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఒక అభిమాని బండ్ల గణేష్ కు ట్వీట్ చేస్తూ.. అన్న పవన్ అన్నకు నీకు మనస్పర్ధలు వల్ల అన్నకు దూరంగా ఉండొద్దు.. ఒంటరిగా ఉన్న వ్యక్తికి నీలాంటి వాళ్ళు చాలా రిలీఫ్. సమయం కుదిరినప్పుడు పవన్ ను కలువు ఆయనని అర్థం చేసుకోలేక చాలామంది ఆయనకు దూరం అవుతున్నారు నువ్వు కూడా దూరం కావొద్దు అంటూ ట్వీట్ చేశారు.
ఈ విధంగా అభిమాని బండ్ల గణేష్ కు ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ పై బండ్ల గణేష్ స్పందిస్తూ.. మన దేవుడు మంచోడే కానీ ఆ డాలర్ శేషాద్రి తోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ అనిపేర్కొన్నారు. ఇలా బండ్ల గణేష్ ఆయనతోనే సమస్య అంటూ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈయన పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ చేశారంటే పలువురు భావిస్తున్నారు.

Bandla Ganesh: త్రివిక్రమ్ బండ్ల మధ్య ఈ గ్యాప్ ఏంటి…
ఇలా పవన్ కు బండ్ల గణేష్ కు మధ్య దూరం పెరగడానికి త్రివిక్రమ్ కారణమని తెలియడంతో అసలు త్రివిక్రమ్ బండ్లకు ఉన్నటువంటి మనస్పర్ధలు ఏంటి ఎందుకు వీరి మధ్య ఇలాంటి మనస్పర్ధలు వస్తున్నాయి అనే విషయం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇక బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అభిమానులు మాత్రం ఆయన తిరిగి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలనీ కోరుతున్నారు.బండ్ల గణేష్ కూడా పవన్తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా వెనక్కి తగ్గుతున్నారు.