Bandla Ganesh: బండ్ల గణేష్ పొలిటికల్ రీ ఎంట్రీ… ఏ పార్టీ వైపు అడుగులు వేస్తున్నాడు..?

0
37

Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. అంతేకాకుండా కొంతకాలం రాజకీయాలలో కూడా సందడి చేశాడు. అయితే తనకు రాజకీయాలు అచ్చిరావని అర్థం చేసుకొని వాటికి గుడ్ బై చెప్పేసాడు.

Bandla Ganesh: బ్రేకింగ్ న్యూస్.. బండ్ల గణేష్ పై అరెస్టు వారెంట్ జారీ..కారణం ఏంటంటే..!

మరొకసారి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నట్లు బండ్లన్న స్వయంగా వెల్లడించాడు. పొలిటికల్ రీ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో బండ్ల గణేష్ చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని, నీతి,నిజాయితీ, పౌరుషం, పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాలలోకి రావాలని, అందుకే తాను మళ్లీ రాజకీయాలలో రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ట్వీట్ చేశాడు. అంతే కాకుండా బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై.. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తా అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు చర్చంశనీయంగ మారాయి.

ఇక బండ్ల గణేష్ అడుగులు ఇప్పుడు ఏ పార్టీ వైపు పడతాయో అని అందరూ ఆలోచనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ వీరాభిమాని. అందువల్ల బండ్ల గణేష్ జనసేన కండువా తప్పకుండా అంటూ కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొకవైపు బండ్ల గణేష్ అడుగులు కాంగ్రెస్ వైపే ఉంటాయని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే బండ్ల గణేష్ చేస్తున్న ట్వీట్స్ చూస్తుంటే తిరిగి ఆయన కాంగ్రెస్ జెండానే పెట్టబోతున్నట్లు కన్ఫర్మ్ అవుతోంది.

Bandla Ganesh: సోనియా గాంధీ ఫోటో షేర్ చేసిన బండ్ల గణేష్…


మదర్స్ డే సందర్భంగా తన తల్లి ఫొటోతో పాటు మదర్ ఆఫ్ తెలంగాణా అంటూ సోనియా గాంధీ ఫోటో కూడా పెట్టాడు. దీంతో బండ్ల గణేష్ మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. అంతే కాకుండా ఇంతకాలం కెసిఆర్ ని తిట్టిన బండ్ల గణేష్ ఇప్పుడు ఆయన మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. యాదాద్రి నిర్వాణ విషయంలో కెసిఆర్ పట్ల వల్ల గణేష్ ప్రశంసల కురిపించాడు. దీంతో బండ్ల గణేష్ బిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.