అమరావతి రైతుల ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే… అయితే ఆదివారం సాయంత్రం అమరలింగేశ్వర స్వామి వేడుకలు ఉండడంతో అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోడానికి గుడికి వెళ్తున్న రైతు కాలిపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్ లోని కారు దూసుకెళ్లింది. అదే సమయంలో అమరలింగేస్వర స్వామి రధోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తున్నారు కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఈ క్రమంలోనే ఎంపీ సురేష్ కూడా తన కాన్వాయ్ తో వెళుతున్నారు.

అదే సమయంలో వెలగపూడి, తుళ్లూరుకు చెందిన కొందరు రైతులు రధోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అయితే ఆలయానికి కొద్దిదూరంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో నడిచి వెళ్ళమని చెప్పారు. దేనితో వారు ర్యాలీగా వెళ్తున్నారు. ఆసమయంలో అటుగా వచ్చిన వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కారు.. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో.. బస్సు తగ్గించే క్రమంలో రైతు కాలిపై ఎక్కింది… రైతు కాలికి తీవ్ర గాయం అవ్వడంతో తోటి రైతులంతా కలిసి హుటాహుటీన ఆసుపత్రి కి తీసుకెళ్లారు. కాలిపై కారు ఎక్కినా కూడా ఎంపీ సురేష్ కనీసం కారు ఆపకుండా వెళ్లిపోయారని మిగిలిన రైతులు మండిపడుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here