ప్రస్తుతం టాలీవుడ్ ఫుల్ ఫామ్ లో ఉన్న ఏకైక స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే..ఈ పొడుగు కాళ్ళ సుందరికి వద్దన్నా కూడా తెగ ఆఫర్లు వస్తున్నాయట.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. ఒకలైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజ. ఆతర్వాత ఫుల్ బిజీ అయిపొయింది. అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలో అందాల విందుతో కనువిందు చేసింది పూజ. ప్రస్తుతం తెలుగు, హిందీల్లో సినిమాలు చేస్తున్నపూజ త్వరలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన నటించబోతుంది. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది ఈ బుట్టబొమ్మ.

అలాగే బాలీవుడ్ లోను స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ విజయ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇటీవల మాస్టర్ సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. ఇప్పుడు మరో భారీ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్ గురించి ఫిలిం నగర్ లో పెద్దేత్తున్న చర్చ జరుగుతుంది. అయితే ఈ సినిమాల్లో పూజ పాప హీరోయిన్ గా ఎంపిక అయ్యిందంటూ కూడా టాక్ నడుస్తుంది.

మరోవైపు అవకాశాలు వెల్లువెత్తడంతో అన్ని సినిమాలు చేయలేక భారీ రెమ్యునరేష్ ను డిమాండ్ చేస్తుందంట పూజ. అలాగైనా కొందరు నిర్మాతలు వెనకడుగేస్తారని భావిస్తుంది ఈ బుట్టబొమ్మ. ఇక మహేష్ త్రివిక్రమ్ సినిమాలో పూజ దాదాపు కన్ఫామ్ అయిపోయిందని తెలుస్తుంది. ఇలా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అవకాశాలు దక్కించుకుంటూ అదికూడా భారీ ఎమ్యూనరేషన్ తో సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు.ఇక ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ నటిస్తున్న రాదే శ్యామ్, ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here