బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో 5 వ వారం ఎలిమినేషన్ ఈ రోజు జరగనుంది. ఈ రోజు ప్రోగ్రాం సాయంత్రం 6 గంటలకు మొదలు కానుందని బిగ్ బాస్ నిర్వాహకులు తెలిపారు. దసరా సందర్భంగా స్పెషల్ గెస్ట్ లు కూడా వచ్చారు. మనకు చూపించిన ప్రోమోలో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే , జబర్ధస్త్ ఆది ఇంకా చాలామంది సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఒక్కరిని కూడా సేవ్ చేయని నాగార్జున ఈ రోజు ఎలిమినేషన్ ఉంటుందని చెప్పాడు.

ప్రస్తుతం 15 మంది కంటెస్టెంట్లు ఉన్న ఆ హౌస్ లో ఈ సారి నామినేషన్లో 9 మంది ఉన్నారు. . ఇక ఈ వారం యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో హమీదా, విశ్వ, జెస్సీ డేంజర్ జోన్‌లో ఉండగా వీళ్లలో నుంచే ఒకరు ఎలిమినేట్ అవుతారని ముందునుంచే ప్రచారం జరుగుతోంది.
ఎలిమినేషన్‌లోనూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటాయి. అన్నట్లుగానే ఆ ముగ్గురిలో నుంచి ఒకరు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఐదోవారం హమీదాపై ఎలిమినేషన్ వేటు పడినట్లు సోషల్ మీడియాలో లీకులు వినిపిస్తున్నాయి. మొదటి వారం నుంచి కూడా లీకు రాజాలు చెప్పిన విధంగానే జరుగుతున్నాయి. ఈ సారి కూడా ఇది నిజం అవుతాందా లేదా అనేది చూడాలి.
శ్రీరామ్ తో లవ్ అండ్ రొమాన్స్ చేస్తూ టాస్క్ లను మాత్రం పక్కన పెట్టేసింది అనే టాక్ వినిపిస్తోంది. అందుకే హమిద ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఊహించిన దాని కంటే భిన్నంగా ఉండటమే బిగ్ బాస్ హౌస్ ప్రత్యేకత. మరో వైపు దసరా సందర్భంగా ఎలిమినేషన్ ఉండదని టాక్ వినిపిస్తోంది. ఇది కూడా ఎంత వరకు నిజమో ఈ రోజు సాయంత్రం తేలిపోనుంది.
































