మారుతున్న కాలంతో పాటే మనుషుల్లో ఓపిక తగ్గిపోతోంది. కిలోమీటర్ దూరం నడవాలంటే కూడా చాలామంది భారంగా ఫీలవుతున్నారు. మూడు నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఇక తమ వల్ల కాదని ఆగిపోతున్నారు. అయితే ఒక బాలుడు మాత్రం అమ్మమ్మ కోసం ఏకంగా 2,800 కిలోమీటర్లు నడిచాడు. ఇటలీలోని సిసిలీ నుంచి లండన్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అంత దూరం ప్రయాణం చేసిన ఆ బాలుడి పేరు రోమియో.

పూర్తి వివరాల్లోకి వెళితే సిసిలీలో తల్లిదండ్రులతో నివశించే రోమియోకు అమ్మమ్మ అంటే పంచప్రాణాలు. లండన్ లో నివశించే అమ్మమ్మను ప్రతి సంవత్సరం సెలవుల్లో తల్లిదండ్రులతో వెళ్లి కలిసేవాడు. అయితే ఈ సంవత్సరం కరోనా, లాక్ డౌన్ వల్ల బాలుడికి అమ్మమ్మను కలవడం సాధ్యం కాలేదు. దీంతో బాలుడు అమ్మమ్మపై బెంగ పెట్టుకున్నాడు. అమ్మమ్మను కలవాలని ఉందంటూ మారాం చేశాడు.

దీంతో బాలుడి తల్లిదండ్రులకు సైతం టెన్షన్ పట్టుకుంది. బాలుడు ఎంత చెప్పినా వినకపోవడం, అంతదూరం ప్రయాణం చేయడానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 20న బాలుడు, బాలుడి తండ్రి ప్రయాణం మొదలుపెట్టగా సెప్టెంబర్ 21న లండన్ కు చేరుకున్నారు. ప్రయాణ సమయంలో ఎన్ని సమస్యలు వచ్చినా చివరకు గమ్యస్థానానికి చేరుకున్నారు.

ప్రస్తుతం బాలుడు తన తండ్రితో కలిసి ఐసోలేషన్ లో ఉన్నాడు. ఐసోలేషన్ తరువాత అమ్మమ్మను కలుసుకోనున్నాడు. త్వరలో అమ్మమ్మను కలుసుకోనుండటంతో బాలుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు బాలుడు ప్రయాణ సమయంలో ఫండ్ రైజింగ్ ద్వారా 11.4 లక్షల రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బులను శరణార్థుల పిల్లల చదువు కోసం వినియోగిస్తానని రోమియో చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here