Chiranjeevi: చిరంజీవికి నిజంగానే మోకాలి సర్జరీ జరిగిందా… వైరల్ అవుతున్న తమన్న కామెంట్స్!

0
50

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోగా యువ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తమన్న మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరికి చిరంజీవి సర్జరీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. చిరంజీవి అమెరికా వెళ్లినది వెకేషన్ కోసం కాదని సర్జరీ కోసం వెళ్లారు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ వార్తల గురించి వీరిని ప్రశ్నించగా తమన్నా చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారు ఈ సినిమాలోని ఒక పాట షూట్ చేసే సమయంలో తీవ్రమైన మోకాళ్ళ నొప్పి సమస్యతో బాధపడ్డారని తమన్న తెలిపారు.అయితే మోకాలి నొప్పి సమస్య ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఆ విషయాన్ని దాచిపెట్టి షూటింగ్లో పాల్గొన్నారు.

Chiranjeevi: మోకాలు నొప్పి నిజమేనా…


ఇలా ఒక సినిమా పట్ల ఇంత డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తులను తాను ఇప్పటివరకు చూడలేదు అంటూ తమన్న చిరంజీవి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఆయన మోకాలి సర్జరీ గురించి వచ్చినటువంటి వార్తలు నిజమేనని తెలుస్తోంది.ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.