AP Politics: ఏపీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సభలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో రాష్ట్ర తెలుసనీ, తన చెల్లెలు షర్మిల సునీతను కూడా తమ రాజకీయాలలో పావులుగా వాడుకున్నారని తెలిపారు.
నా చెల్లెమ్మలు ఇద్దరూ కూడా హంతకులకే మద్దతు తెలుపుతున్నారని జగన్ మండిపడ్డారు. చెల్లెమ్మలు చిన్నాన్నను చంపిన వారితో చేతులు కలపగా నేను మాత్రం ప్రజల పక్షమే ఉంటానని జగన్ తెలిపారు. ఇలాంటి హంతకులతో అవినీతిపరులతో యుద్ధం చేయడానికి ఈ అర్జునుడు సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ ఈ కార్యక్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
కూటమి అంటే కుట్రలు..
వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. కూటమి అంటే కుట్రలు కుతంత్రాలని జగన్ తెలిపారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ డ్రగ్స్ వ్యవహారంపై కూడా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


































