సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు పృథ్వి రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న పృథ్వి ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పృథ్వి రాజ్ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా పృథ్వి రాజా నటుడు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పృథ్వి రాజ్ మాట్లాడుతూ కత్తి మహేష్ మరణించినప్పటికీ అతని గురించి చేసే పలు వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉంటాయని పృద్వి తెలిపారు. కత్తి మహేష్,కమెడియన్ పృథ్వి గత ఎన్నికలలో భాగంగా వైసీపీ తరఫున పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఈ విధంగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి పృధ్విరాజ్ తెలియజేశారు. ఈ క్రమంలోనే పృథ్వి రాజ్ తనని కత్తి మహేష్ అన్నా అని పిలిచే వాడని, ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు ఎంతో సహాయం చేశాడని తెలిపారు.

ఈ క్రమంలోనే ఇద్దరం క్యాజువల్ గా మాట్లాడుతున్న సమయంలో ఎందుకు అంత వివాదాలకు కారణమవుతూ దారుణంగా ఎందుకు ట్రోలింగ్ అవుతున్నావని కత్తి మహేష్ ను అడిగినప్పుడు అందుకు సమాధానంగా అన్నా.. మనం యుద్ధం చేస్తున్నాము. సైలెంట్ గా ఒక చెట్టు కింద కూర్చుంటే అవతలి వారు మన తల తీసేస్తారు. అందుకే ఎప్పుడూ సైలెంట్ గా ఉండకూడదు అని చెప్పేవారు.

నిజానికి కత్తి మహేష్ ఎంతో మంచి మనస్తత్వం కలవాడు. కత్తి మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ ఆయన మరణంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రైవర్ కి ఏమీ కాకుండా కేవలం మహేష్ కు మాత్రమే అలా జరగడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఏది ఏమైనా చనిపోయిన ఒక వ్యక్తి గురించి ఎంతో దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అది ఎంతో బాధాకరం..అంటూ కమెడియన్ పృథ్విరాజ్ కత్తి మహేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
































