భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. దీంతో ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్క భారతీయడు Independence Dayను ఘనంగా జరుపుకున్నారు. అయితే ఇదిలా ఉండగా.. జార్ఖండ్ ధన్‌బాద్‌లో మాత్రం ఓ విషాదం నెలకొంది. అక్కడ కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ జెండాను ఆవిష్కరించారు. వెంటనే అక్కడే కుప్పకూలిపోయాడు.

జెండా ఎగరేశాక తుదిశ్వాస విడిచారు. జెండా వందన కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత అన్వర్ హుస్సేన్ అప్పటి వరకూ బాగానే ఉన్నారు. అక్కడ ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావుల గురించి.. వాళ్ల చరిత్రపై మాట్లాడారు. తర్వాత జెండాను ఎగురవేసి.. సెల్యూట్ చేశారు. వెంటనే కింద కుప్పకూలీపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అంతే… అక్కడున్న వారంతా… ఏమైంది… ఏమైంది అనుకుంటూ… ఆఘమేఘాలపై ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ నేతను పరీక్షించని వైద్యులు అప్పటికే అతడు తుది శ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు.
అతడు అక్కడ చిర్కుండా బ్లాక్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎందుకు చనిపోయాడని డాక్టర్లను అడిగితే… ఆయనకు అతిపెద్ద గుండె పోటు వచ్చిందని తెలిపారు. అందువల్లే చనిపోయారని చెప్పారు. సినిమాల్లో చూపించినట్లుగా గుండెపోటు వస్తే కొన్ని నిమిషాల వరకు బతికే ఉంటారని అనుకుంటారు.
కానీ నిజ జీవితంలో ఇలా ఉండదని.. గుండెపోటు అనేది వచ్చిన ఒకట్రెండు సెకండ్లకే వ్యక్తి మరణిస్తాడని వైద్యులు తెలియజేశారు. అన్వర్ హుస్సేన్ విషయంలో అదే జరిగిందన్నారు. ఈ ఘటన తెలియడంతోనే చిర్కుండా బ్లాక్‌లో విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన కార్యకర్తలు కన్నీరుమున్నీరుగా విలపించారు.




























