Dil Raju: దిల్ రాజు వారసుడు సినిమా విషయంలో తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయంలో ఈయన ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నారు. ఈ సినిమా ఆపాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి సినిమా విషయంపై దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ వారసుడు సినిమా విడుదల ఆపాలనుకుంటే ముందుగా ఛాంబర్ లేదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నన్ను పిలిచి నాతో మాట్లాడాలి కానీ ప్రజలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఈ విషయాలను మీడియా సమావేశంలో మాట్లాడకూడదని ఈయన తెలిపారు.మైత్రి మూవీ మేకర్స్ నన్ను అడ్డుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏ మాత్రం నిజం లేదని రెండు తెలుగు రాష్ట్రాలలో తనకు 70 థియేటర్లో ఉన్నాయి నా థియేటర్లలో నా సినిమా వేసుకుంటున్నానని ఈయన తెలిపారు.
ఇక తమిళనాడులో ఎనిమిది వందల థియేటర్స్ ఉన్నాయి. అక్కడ అందరికన్నా విజయ్ స్టార్ హీరో కనుక ఆయనకు 400 థియేటర్లను కేటాయించి మరొక హీరో అజిత్ కు 400 థియేటర్లను కేటాయించారు. ఇక విజయ్ స్టార్ హీరో కాబట్టి అదనంగా మరో 50 థియేటర్లు ఇవ్వమని ఆడుకుంటున్నాను. సంక్రాంతికి ప్రతి ఒక్క సినిమాకి థియేటర్లు దొరుకుతాయని ఇందులో కంగారు పడాల్సిన పనిలేదని తెలిపారు.

Dil Raju:మైత్రి మూవీస్ వారితో ఎలాంటి విభేదాలు లేవు….
ఇక మైత్రి మూవీ మేకర్స్ వారితో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఈ విషయాలన్నీ కూడా జనవరి ఫస్ట్ వీక్ లో చర్చించుకోవాల్సిన విషయాలని దిల్ రాజు తెలిపారు. ఈలోగా దిల్ రాజు ఏదో చేసేస్తున్నారని పెద్ద ఎత్తున పుకార్లు సృష్టించి గందరగోళానికి గురి చేస్తున్నారని ఈ సందర్భంగా మరోసారి వారసుడు సినిమా వివాదం గురించి దిల్ రాజు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































