Director Geetha Krishna : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటారని నేను ముందే చెప్పాను వారి జాతకాలు కలవలేదు అందుకే విడిపోయారు అంటూ ఇక ప్రభాస్ కి హిట్లు రావంటూ కూడా చెప్పిన వేణుస్వామి వచ్చే ఎన్నికలలో జగన్ కి తిరుగులేదంటూ కూడా ప్రిడిక్షన్స్ అందించాడు. అయితే ఆయన చెప్పిన వాటిలో జరిగినవి ఎన్నో జరిగాక చెప్పినవి ఎన్నో తెలియక పోయినా ఆయన మాత్రం భవిష్యత్ లో ఇద్దరు సెలబ్రిటీలు అందునా ఒక యంగ్ హీరో అలానే ఒక హీరోయిన్ మరణిస్తారు అంటూ ప్రిడిక్షన్ చెప్పాడు. దీంతో తారకరత్న మృతి గురించే వేణుస్వామి చెప్పింది జరిగినది అన్నట్లు అందరూ ఇప్పుడు భావిస్తున్నారు. ఇక దీనిపై డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడారు.

వాడికెలా తెలుసు…ఇదంతా పబ్లిసిటీ స్టంట్…
తారకరత్న మరణం విషయంలో వేణు స్వామి ముందే చెప్పాడు అంటూ వస్తున్న వార్తలను గురించి గీతా కృష్ణ మాట్లాడుతూ అవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ మాత్రమే. ఎవరు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎలా చెప్పగలుగుతారు. నేను కూడా చెబుతా సినిమా. ఇండస్ట్రీలో ఒక హీరో పోతాడు ఒక హీరోయిన్ మరణిస్తుంది అంటూ ఎవరో ఒకరు మరణిస్తూ ఉంటారు, మరణం అందరికీ వస్తుంది అంత మాత్రాన నేను చెప్పినట్లు జరిగినట్టా అంటూ గీతా కృష్ణ ఫైర్ అయ్యాడు.

కొంతమంది బ్రాహ్మణులు జ్యోతిష్యం నేర్చుకుని రాశులకు ఏం జరగొచ్చు అంటూ కొంత ప్రిడిక్షన్స్ ఇస్తుంటారు అందులో కొంత విజ్ఞానం ఉంటుంది కానీ ఇలా పబ్లిసిటీ కోసం వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు అంటూ స్పష్టంగా చెప్పకుండా నేను చెప్పింది జరిగింది అంటూ జనాలను మోసం చేస్తుంటారు అంటూ ఫైర్ అయ్యారు.


































