ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో మనకు సెల్ ఫోన్ దర్శనమిస్తుంది. ఒక్క నిమిషం చేతిలో సెల్ లేకపోతే పాలు పోదు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు సెల్ మన చేతిలో దర్శనమిస్తుంది.ఈ విధంగా గంటల తరబడి సెల్ ఫోన్ కి పరిమితం కావడం వల్ల అనేక సమస్యలు వస్తాయని మనకు తెలిసినప్పటికీ కూడా సెల్ వినియోగించడం తగ్గడం లేదు.

ముఖ్యంగా మగవారు సెల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాల్లో నిరూపించబడింది.సెల్ ఫోన్ వాడటం వల్ల ప్రతి ఒక్కరి లో సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్య మగవారిలో అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం ఫోను ఉపయోగిస్తున్నప్పుడు సెల్ ఫోన్ నుంచి బ్లూ లైట్ వెలువడుతుంది. ఈ లైట్ వల్ల సమస్యలు ఎదురవుతాయి.

సెల్ ఫోన్ నుంచి విడుదలయ్యే ఈ కాంతి మన కళ్ళలో పడినప్పుడు మన కంటికి మాత్రమే కాకుండా మగవారిలో, స్పెర్మ్ కౌంట్ తగ్గించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకోసమే మగవారు వీలైనంతవరకు సెల్ ఫోన్ కి వాడకాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో 23 శాతం మగవారు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమత మవుతున్నారు.మొత్తం జనాభాలో 15 నుంచి 20 ఈ సమస్యతో బాధ పడుతుండగా అందులో 20 నుంచి 40 శాతం మగవారు ఉన్నారు. కనుక భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here