రొయ్యలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు తింటారు. దాదాపు అందరూ దీనిని ఇష్టపడే వాళ్లే. కాకపోతే వాళ్లకు సముద్రం, నదులు దగ్గరగా ఉండటంతో అవి అందుబాటులో దొరుకుతాయి. అయితే కొంతమంది వీటిని తినడానికి ఇష్టపడరు.

కానీ వీటి వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే తినకుండా ఉండలేరు. వాటి గురించి తెలుసుకుందాం.. అయితే ఈ రొయ్యల్లో ఎక్కువగా నాణ్యమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. తరచూ డైట్‌లో రొయ్యలకు చోటిస్తే.. కావాల్సినతం బలం వస్తుంది. అతి తక్కువ ఫ్యాట్ ఉండే మాంసాహారం కేవలం రొయ్యలు మాత్రమే. వీటితో రకరకాల కూరలు వండుకోవచ్చు. ఏది వండినా రుచికరంగానే ఉంటుంది. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మెదడు, నరాల సంబంధిత జబ్బులు కూడా వచ్చే అవకాశం తక్కువ.
రక్త ప్రసరణ సక్రమంగా జరిగేట్లు సహాపపడతాయి. రొయ్యల్ని తినటం వల్ల థైరాయిడ్ సమస్యలు తొలగిపోతాయి. అయితే ముఖ్యంగా దీనిలో క్యాన్సర్ రాకుండా సెలీనియం అనే పదార్థం ఉంటుందట. ఇది శరీరంలో క్యాన్సర్ సెల్ ను పెరగనీయకుండా నియంత్రిస్తుంది. ఇక దంతాలు, ఎముకలకు గట్టి దనాన్ని ఇస్తుంది. చర్మం ఎంతో మృదువుగా తయారవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రక్త హీనత ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే.. ఆ వ్యాధి నుంచి బయటపడొచ్చు. కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా అనేక రకాల వ్యాధులు దరి చేరకుండా.. ఒక వేళ వ్యాధి వచ్చినా.. దీని ద్వారా నియంత్రణ చేసుకోవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.































