ఆధునిక జీవనశైలితో మనకు వచ్చే సమస్యలలో నడుము నొప్పి ఒకటి. వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో గంటల తరబడి కూర్చుని పని చేయడం ద్వారా నడుము నొప్పితో పాటు మరో సంస్య కూడా ఉంది. అతే మెడ నొప్పి కూడా. అయితే ఎక్కవగా నడుము నొప్పి బారిన పడే వారి సంఖ్య అధికం అవుతుంది. నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతున్నారు.

కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు.రోజూ ఉదయాన్నే ఓ పావు గంట సమయం వెచ్చించి.. పద్ధతి ప్రకారం కొన్ని యోగాసనాలు సాధన చేస్తే చాలు.. ఈ వెన్ను బాధలు తొలగిపోతాయి. అంతే కాకుండా.. నొప్పిగా ఉన్న చోట ఐస్ ముక్కను కొంతసేపు పెట్టడం వల్ల కాస్త ఉపశమనం పొందవచ్చు. ఆడవారిలో నడుమునొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి.
ఇందులో ఒకటి హ్యాండ్ బ్యాగు.. బ్యాగుని మనం ఎప్పుడూ ఒకేవైపు వేసుకుంటుంటాం. దీని వల్ల భుజాలు వంగిపోయి నొప్పి వస్తుంటుంది. ఈ ఎఫెక్ట్ నడుముపై కూడా పడుతుంది. అందుకోసం బ్యాగుని తరచూ మారుస్తూ ఉండాలి. దీని వల్ల ఉపశమనం ఉంటుంది. వీలుంటే బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్ ట్రై చేయడం కూడా మంచిది. మీకు పాలు తాగే అలవాటు ఉందా. లేదా తేనే తీసుకునే అలవాటు ఉందా. ఒకవేళ మీకు అలవాటు లేకపోయినా, నడుము నొప్పి తగ్గడానికి గ్లాసు పాలలో ఓ రెండు, మూడు చెంచాల తేనె వేసుకొని రోజూ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
నొప్పి అధికంగా ఉన్న చోట అల్లం పేస్ట్‌ను కాసేపు ఉంచి తీసేస్తే ప్రయోజనం ఉంటుంది. చిన్న అల్లం ముక్కలను నీళ్లలో వేసి వేడిచేయాలి. వడగట్టి చల్లార్చాలి. ఆ మిశ్రమంలో తేనె కలుపుకొని తాగితే ప్రయోజనం ఉంటుందని చెబుతారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు గంటకు ఓసారి లేచి కనీసం మూడు, నాలుగు నిమిషాలు నడవాలి. సుదీర్ఘంగా కూర్చోవడం ద్వారా నడుము నొప్పితో పాటు ఊబకాయం లాంటి సమస్యల బారిన పడతారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నడుపు నొప్పి అనేది రాదు.




























