చెప్పులు లేకుండా నడుస్తున్నారా.. అయితే మంచిదే.. ఎందుకంటే..?

0
335

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు కనీసం ఒక 10 నిమిషాలైనా నడవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆ నడక నడిచే క్రమంలో కూడా షూస్, సాండిల్స్ వేసుకొని చాలామంది నడుస్తుంటారు. కానీ అవేవి వేసుకోకుండా వట్టి కాళ్లతో నడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ప్రస్తుత జీవన గమనంలో ఒక గంట కూడా మనిషికి సమయం దొరకడం లేదు.

అంత బిజీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. అయితే చిన్ని చిన్న పనులకు కూడా నడిచి వెళ్లడం బద్దకం అయి.. వాహనాలను ఉపయోగిస్తున్నాడు. వీటివల్ల వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఉభకాయం పెరగడంతో పాటు.. ఇంకా తెలియని ఎన్నో వ్యాధులు మన శరీరంలో ఉంటున్నాయి.

అవి మనకు రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు బాధపడినా ప్రయోజనం ఉండదు. అయితే ప్రతీ రోజు వ్యాయామం చేయడం అనేది తప్పిని సరి. ఇందులో నడిచే క్రమంలో కాళ్లకు చెప్పులు, షూస్ లాంటివి ధరించకపోవడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా.. నిద్ర లేమితో బాధపడే వారు దీని వల్ల వెంటనే నిద్రపోతారు. వట్టి కాళ్లతో నడిస్తే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇంకా దీని వల్ల కంటికి ఎంతో ఉపయోగం. అతేకాకుండా.. శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ అనేది సజావుగా సాగడంలో ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చెప్పులు లేకుండా భూమి మీద పాదాలు పెట్టడంతో పాదాల వద్ద ఉండే చెడు బ్యాక్టీరియా కూడా పోతుంది. పాదాల శుభ్రత కూడా పెరుగుతుంది.